diabetes: మధుమేహం నుంచి విముక్తి పొందొచ్చా..? చాట్ జీపీటీ సమాధానం ఇదే

how to reverse diabetes

  • మధుమేహం నుంచి విముక్తి కాలేరన్న సమాధానం
  • ఈ సమస్యను నియంత్రణలో పెట్టుకోవచ్చని సూచన
  • జీవనశైలిలో మార్పులు, పోషకాహారం, వ్యాయామం చేయాలి

మధుమేహం అనేది జీవక్రియల్లో మార్పుల ఫలితంగా వచ్చే ఆరోగ్య సమస్య. ఒక్కసారి దీని బారిన పడిన తర్వాత.. తిరిగి మధుమేహం లేని స్థితికి వెళ్లిపోవచ్చా? మధుమేహం సమస్య నుంచి విముక్తి పొందామని చెప్పడం సాధ్యమేనా?? అంటే దీనికి చాట్ జీపీటీ ఏమని సమాధానం చెప్పిందో తెలుసా..?

దురదృష్టవశాత్తూ మధుమేహం అన్నది దీర్ఘకాలం పాటు ఉండే పరిస్థితి. దీన్ని పూర్తిగా నిర్మూలించడం లేదా దీన్నుంచి పూర్వపు స్థితికి వెళ్లిపోవడం అసాధ్యం. కానీ పలు విధానాల ద్వారా దీన్ని సమర్థవంతంగా నిర్వహణలో (నియంత్రణలో) పెట్టుకోవచ్చు. 

టైప్ 1 మధుమేహం అన్నది ఆటో ఇమ్యూన్ వ్యాధి. పాంక్రియాస్ ఇన్సులిన్ ను ఉత్పత్తి చేయలేకపోవడం వల్ల ఏర్పడే సమస్య. టైప్ 1 మధుమేహంతో బాధపడే వారు ఇన్సులిన్ థెరపీ తీసుకోవాలి.

టైప్ 2 మధుమేహం అనేది మన శరీరంలో ఇన్సులిన్ నిరోధకత ఏర్పడినప్పుడు వచ్చేది. లేదా రోజువారీ జీవక్రియలకు సరిపడా ఇన్సులిన్ ను ఉత్పత్తి చేయలేకపోవడం వల్ల కూడా ఇది తలెత్తవచ్చు. దీన్ని జీవనశైలిలో మార్పులు చేసుకోవడం ద్వారా.. అంటే ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం, రోజువారీగా శారీరక వ్యాయామాలు చేయడం, బరువు పరిమితికి మించి లేకుండా చూసుకోవడం, మధుమేహం నియంత్రణ ఔషధాలు లేదా ఇన్సులిన్ ను తీసుకోవడం వల్ల నియంత్రణలో పెట్టుకోవచ్చు.

మధుమేహం నిర్ధారణ అయితే డాక్టర్ ను సంప్రదించాలి. మీకంటూ సరిపోయే చికిత్స ప్రణాళికను అనుసరించాలి. బ్లడ్ షుగర్ ను నియంత్రణలో పెట్టుకుని, జీవనశైలిలో మార్పులతో రిస్క్ తగ్గిపోతుంది. అప్పుడు మధుమేహం ఉన్నా కానీ, ఆరోగ్యంగా జీవించొచ్చు.

మధుమేహం నియంత్రణకు మార్గాలు
  • చక్కెర వినియోగాన్ని దాదాపు తగ్గించేయాలి. మానేసినా మంచిదే. కార్బోహైడ్రేట్లు ఎక్కువగా ఉండే వాటికి దూరంగా ఉండాలి. ముడి ధాన్యాలు, తృణ ధాన్యాలు, కూరగాయలు, పండ్లు తీసుకోవాలి.
  • బరువు ఎక్కువగా ఉంటే ఆ మేరకు తగ్గిపోవాలి.
  • అన్ని పోషకాలు అందే సమతులాహారం తీసుకోవాలి. తీసుకునే ఆహారంలో పీచు తప్పకుండా ఉండాలి.
  • రోజువారీ తప్పకుండా వ్యాయామం చేయాలి. 
  • ఒత్తిడి పెరిగితే మధుమేహం కూడా అధికమవుతుంది. కనుక ఒత్తిడిని జయించేందుకు ప్రాణాయామం, యోగాసనాలను అనుసరించొచ్చు.
  • రోజువారీ తగినంత నిద్ర ఉండేలా చూసుకోవాలి.
  • పొగతాగడం, మద్యపానం అలవాట్లను మానివేయాలి. 
  • రోజులో సరిపడా నీరు తాగాలి.
  • వైద్యులు సూచించిన ఔషధాలను క్రమం తప్పకుండా తీసుకోవాలి. మూడు నెలలకు ఒకసారి వైద్యులను సంప్రదించాలి.

  • Loading...

More Telugu News