Perni Nani: పవన్ ను సీఎం చేయాలని జనసైనికులు సాఫ్ట్ వేర్ ఉద్యోగాలు మాని రోడ్లపై తిరుగుతున్నారు: పేర్ని నాని

Perni Nani comments on Pawan Kalyan

  • తాను సీఎం అభ్యర్థిని కానన్న పవన్ కల్యాణ్
  • పవన్ ను నమ్మిన జనసైనికుల గురించే తన బాధ అంటూ పేర్ని నాని వ్యాఖ్యలు
  • జనసైనికులు పవన్ కోసం త్యాగాలు చేయడం మానుకోవాలని సూచన
  • తల్లిదండ్రుల ఆశలు నెరవేర్చాలని హితవు

గత ఎన్నికల్లో జనసేనను 30-40 సీట్లలో గెలిపించి ఉంటే సీఎం పదవిని డిమాండ్ చేయగలిగేవాళ్లమని, ఇప్పుడు సీఎం అభ్యర్థి రేసులో తాను నిలుచునే పరిస్థితి లేదని పవన్ కల్యాణ్ వ్యాఖ్యానించడం తెలిసిందే. దీనిపై వైసీపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి పేర్ని నాని స్పందించారు. 

పవన్ కల్యాణ్ ను ముఖ్యమంత్రిని చేయడం కోసం జనసైనికులు సాఫ్ట్ వేర్ ఉద్యోగాలు కూడా మానుకుని రోడ్లపై తిరుగుతున్నారని వెల్లడించారు. పవన్ మాత్రం తాను సీఎం అభ్యర్థిని కానంటున్నారని, ఇప్పుడు పవన్ ను నమ్మిన జనసైనికుల పరిస్థితి ఏంటని అన్నారు. నా బాధ అంతా అలాంటి జనసైనికుల గురించే అని పేర్ని నాని వెల్లడించారు. జనసైనికులు ఇకనైనా పవన్ కోసం త్యాగాలు మాని, తమ తల్లిదండ్రుల ఆశలు నెరవేర్చేందుకు కృషి చేయాలని సూచించారు. 

చంద్రబాబుకు అవసరమైనప్పుడే పవన్ బయటికి వస్తాడని, చంద్రబాబు అవసరాలు తీర్చేందుకు ఏర్పాటైన టెంట్ హౌస్ పార్టీ జనసేన అని ఎద్దేవా చేశారు. ఇటీవల వారాహి అంటూ సందడి చేసిన పవన్... ఇప్పుడు ముందస్తు ఎన్నికలు వస్తే బయటికి తీస్తానంటున్నాడని విమర్శించారు. 

2014లో చంద్రబాబుకు అనుకూలంగా ఉండడంతో పవన్ పోటీ చేయలేదని తెలిపారు. కానీ, 2019లో చంద్రబాబుకు వ్యతిరేకత ఉందని పవన్ గుర్తించాడని, అందుకే చంద్రబాబు వ్యతిరేక ఓటు జగన్ కు వెళ్లకుండా ఆ ఎన్నికల్లో పోటీ చేశాడని పేర్ని నాని వెల్లడించారు. కేవలం ఓట్ల కోసమే రాజకీయాలు చేసే పవన్ కల్యాణ్ పనైపోయిందని స్పష్టం చేశారు.

  • Loading...

More Telugu News