The Kerala Story: వివాదాల కేరళ స్టోరీ.. వంద కోట్లకు వసూళ్ల జోరు!

The Kerala Story closer to Rs 100 crore mark
  • ఈ నెల 5న విడుదలైన చిత్రం
  • బ్యాన్ చేసిన పలు రాష్ట్రాలు
  • ఏడు రోజుల్లోనే రూ. 94 కోట్ల కలెక్షన్
ఎన్నో వివాదాలు, గొడవల మధ్య దేశ వ్యాప్తంగా విడుదలైన సినిమా ‘ది కేరళ స్టోరీ’ బాక్సాఫీస్ వద్ద వసూళ్ల వర్షం కురిపిస్తోంది. ఆదాశర్మ కీలక పాత్ర పోషించిన ఈ చిత్రం కలెక్షన్లలో దూసుకెళ్తోంది. కొన్ని రాష్ట్రాలు చిత్రాన్ని బ్యాన్ చేసినా, మరికొన్ని చోట్ల అనేక ఆంక్షలు విధించినా ప్రేక్షకులు మాత్రం బ్రహ్మరథం పడతున్నారు. దాంతో భారీగా వసూళ్లు సాధిస్తున్న చిత్రం నిర్మాతకు లాభాలు తెచ్చిపెడుతోంది.

ఈ నెల 5న ఈ చిత్రం విడుదలగా.. ఏడో రోజు రూ. 12.50 కోట్లు రాబట్టింది. ఇప్పటిదాకా మొత్తంగా రూ. 94 కోట్లు సొంతం చేసుకుంది. మరో రోజులో వంద కోట్ల మార్కును దాటనుంది. సుదీప్తో సేన్ దర్శకత్వం కేవలం రూ. 16 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ చిత్రం నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లకు లాభాల పంట పడిస్తోంది.
The Kerala Story
Rs 100 crore mark
cillection

More Telugu News