eggs: గుడ్డును పచ్చసొనతో తీసుకోవాలా.. లేకుండా తీసుకోవాలా?

With or without the yolk The best way to consume eggs

  • గుడ్డును మొత్తంగా తీసుకుంటే అధిక ప్రయోజనాలు
  • మరింత ప్రొటీన్ తో పాటు విటమిన్ ఏ, డీ, ఈ 
  • వీటిల్లో యాంటీ ఆక్సిడెంట్లతో వ్యాధి నిరోధక రక్షణ

గుడ్డు ఆరోగ్యానికి మంచిది. కాకపోతే దీనిలో పచ్చ సొన కాకుండా తెల్ల సొన తీసుకోవాలని కొందరి విషయంలో వైద్యులు సూచిస్తుంటారు. కానీ, ఇది అందరికీ కాదు. గుడ్డులో మంచి ప్రొటీన్, ముఖ్యమైన అమైనో యాసిడ్స్ ఉంటాయి. అందుకే గుడ్డును బ్రేక్ ఫాస్ట్ కింద తీసుకోవడం మంచిది. అది కూడా పూర్తి గుడ్డును తీసుకోవాలి. కొందరు గుడ్డులో పచ్చ సొన తీసివేసి మిగిలింది తింటుంటారు. పచ్చ సొనలో కొవ్వులు ఉన్నాయని అలా చేస్తుంటారు. నిజానికి గుడ్డు పచ్చ సొనలోనూ గుండెకు మంచి చేసే ఫ్యాట్స్ ఉంటాయని వైద్యులు చెబుతున్నారు. 

మంచి ప్రొటీన్ తో పాటు గుండెకు మేలు చేసే అన్ శాచురేటెడ్ ఫ్యాట్, ఒమెగా 3 ఫ్యాట్స్ కూడా ఉంటాయి. రైబో ఫ్లావిన్, విటమిన్ డీ, విటమిన్ బీ 12 లభిస్తాయి. గుడ్డు పచ్చ సొనలో విటమిన్ ఏ, డీ, ఈ, కే, కొలైన్ ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. పైగా గుడ్డులో ఉన్న ఫ్యాట్స్ మంచి చేసేవి. గుడ్డులోని కొలైన్ మెదడు ఆరోగ్యానికి మేలు చేస్తుంది. యాంటీ ఆక్సిడెంట్లు అయిన లూటిన్, జియాక్సాంతిన్ కూడా ఉంటాయి. వీటితో రోగ నిరోధక వ్యవస్థ బలంగా ఉంటుంది. గుండె జబ్బులు ఉన్నవారు ఒక గుడ్డుకు పరిమితం కావడమే మంచిదన్నది నిపుణుల సూచన.

  • Loading...

More Telugu News