Congress: కాంగ్రెస్ ముందు జాగ్రత్త చర్యలు.. గెలిచిన అభ్యర్థులు తమిళనాడుకు తరలింపు?

Congress plans to move MLA elects to Tamil Nadu

  • 133 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్న కాంగ్రెస్
  • మెజారిటీ తగ్గితే జాగ్రత్త పడాలని భావిస్తున్న నేతలు
  • గత అనుభవాల నేపథ్యంలో గెలిచిన ఎమ్మెల్యేలను తమిళనాడుకు తరలించాలని యోచన

కర్ణాటకలో భారీ విజయం దిశగా కాంగ్రెస్ పార్టీ దూసుకుపోతోంది. మ్యాజిక్ ఫిగర్ 113 కాగా.. అంతకన్నా ఎక్కువగా 133 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. ప్రస్తుతం నాలుగు చోట్ల గెలవగా.. 129 స్థానాల్లో ముందంజలో ఉంది. దీంతో ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేయ‌డం దాదాపు ఖాయ‌మైంది.

అయినప్పటికీ గెలిచిన త‌మ అభ్యర్థులను ర‌క్షించుకునే ప‌నిలో క‌ర్ణాట‌క‌ కాంగ్రెస్ పార్టీ ఉన్న‌ట్లు తెలుస్తోంది. ఇకవేళ ఇదే మెజారిటీ వస్తే ఏ సమస్యా ఉండదని, మెజారిటీ తక్కువగా ఉంటే జాగ్రత్త పడాలని భావిస్తోంది. గత అనుభవాల నేపథ్యంలో ఎన్నికైన ఎమ్మెల్యేల‌ను త‌మిళ‌నాడుకు షిప్ట్ చేయాల‌న్న యోచ‌న‌లో కాంగ్రెస్ వ‌ర్గాలు ఉన్న‌ట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. బీజేపీ గేమ్‌ ప్లాన్ నుంచి త‌ప్పించుకునేందుకు కాంగ్రెస్ ఈ ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది.

తమిళనాడులో డీఎంకే అధికారంలో ఉండటం, ఆ పార్టీతో కాంగ్రెస్ కు మంచి సంబంధాలు ఉండటంతో గెలిచిన వారిని అక్కడికి పంపాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. డీంఎకే నేత‌ల‌తో కర్ణాటక కాంగ్రెస్ నేత‌లు ట‌చ్‌లో ఉన్న‌ట్లు కొన్ని క‌థ‌నాలు చెబుతున్నాయి. ఈ రోజు సాయంత్రమే ఎన్నికైన ఎమ్మెల్యేలను బెంగళూరుకు రప్పించేందుకు ఏర్పాట్లు జరుగుతున్న పేర్కొంటున్నాయి.

  • Loading...

More Telugu News