National Medical Commission: కొత్త రూల్.. ఇకపై భారత్‌లోని వైద్యులందరికీ ప్రత్యేక గుర్తింపు సంఖ్య
- నేషనల్ మెడికల్ కమిషన్ కొత్త మార్గదర్శకాలు
- దేశవ్యాప్తంగా వైద్యుల వివరాలతో ఉమ్మడి రిజిస్టర్
- రిజిస్టర్‌లో పేరు నమోదు చేసుకున్న వారికి ఐదేళ్ల కాలపరిమితిపై లెసెన్స్ జారీ
- లైసెన్స్ ముగిసే మూడు నెలల లోపు రెన్యూవల్‌కు అనుమతి
భారత్‌లోని డాక్టర్లందరికీ ఇకపై ప్రత్యేక గుర్తింపు సంఖ్యను కేటాయించనున్నారు. నేషనల్ మెడికల్ కమిషన్ (ఎన్ఎమ్‌సీ) కొత్త నిబంధనల ప్రకారం, ఎన్‌ఎమ్‌సీ ఎథిక్స్ బోర్డు ఈ సంఖ్యను జారీ చేస్తుంది. తద్వారా వైద్యుల పేర్లను జాతీయ మెడికల్ రిజిస్ట్రీలో నమోదు చేయడంతో పాటూ వారికి దేశంలో ప్రాక్టీసు చేసుకునేందుకు అనుమతి ఇస్తుంది. దేశంలోని ప్రతి వైద్యుడికి ఈ యూనీక్ ఐడీ నెంబర్ తప్పనిసరి.
ఎన్ఎమ్‌సీ తాజా నోటిఫికేషన్ ప్రకారం, దేశంలోని వైద్యులందరి కోసం ఉమ్మడిగా ఓ నేషనల్ మెడికల్ రిజిస్టర్‌ను ఏర్పాటు చేస్తారు. ఇవే వివరాలతో మరో రిజిస్టర్ ఎథిక్స్ బోర్డు వద్ద కూడా ఉంటుంది. రాష్ట్రాల మెడికల్ కౌన్సిల్స్ వద్ద ఉన్న రిజిస్టర్లలోని వైద్యుల వివరాలన్నీ ఈ జాతీయ రిజిస్టర్‌లో చేరుస్తారు. వైద్యులకు సంబంధించి తగు వివరాల్ని ఈ రిజస్టర్‌లో పొందుపరస్తారు.
రిజిస్టర్‌లో పేరు నమోదు చేసుకున్న వైద్యులకు 5 ఏళ్ల కాలపరిమితపై వైద్య వృత్తిని ప్రాక్టీసు చేసుకునేందుకు లైసెన్స్ జారీ చేస్తారు. కాలపరిమితి ముగిశాక వైద్యులు తమ లైసెన్స్ పునరుద్ధరణ కోసం స్టేట్ మెడికల్ కౌన్సిల్‌లో దరఖాస్తు చేసుకోవాలి. మరో మూడు నెలల్లో కాలపరిమితి ముగుస్తుందనగా వైద్యులు రెన్యూవల్‌కు దరఖాస్తు చేసుకోవచ్చు.