Gujarat Titans: ఉన్నట్టుండి గుజరాత్ టైటాన్స్ జెర్సీ రంగు మారిందేమిటి?

Gujarat Titans in lavender jersey Why are GT players wearing new kits in IPL 2023 match against SRH

  • సాధారణంగా డార్క్ బ్లూ రంగు జెర్సీని ధరించే గుజరాత్ టైటాన్స్
  • సన్ రైజర్స్ తో మ్యాచ్ సందర్భంగా లావెండర్ జెర్సీతో దర్శనం
  • కేన్సర్ పై అవగాహన కల్పించేందుకు ఈ మార్పు

అహ్మదాబాద్ లోని నరేంద్ర మోదీ స్టేడియంలో సోమవారం గుజరాత్ టైటాన్స్, సన్ రైజర్స్ హైదరాబాద్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ లో ఓ ప్రత్యేకత కనిపించింది. గుజరాత్ టైటాన్స్ జట్టు సభ్యులు అందరూ కొత్త జెర్సీతో కనిపించారు. దీంతో క్రికెట్ అభిమానుల్లో ఒక్కసారిగా ఆశ్చర్యం కలిగింది. అదేంటి ఉన్నట్టుండి సీజన్ మధ్యలో జెర్సీ రంగు మారిపోయిందేమిటి? అన్న అయోమయానికి గురయ్యారు. 

గుజరాత్ టైటాన్స్ జట్టు 2022లో కొత్తగా ఏర్పాటైంది. అప్పటి నుంచి డార్క్ బ్లూ రంగు జెర్సీని వారు ధరిస్తున్నారు. ఈ సీజన్ లోనూ నిన్నటి మ్యాచ్ ముందు వరకు అదే రంగు జెర్సీతో కనిపించారు. కానీ సన్ రైజర్స్ తో మ్యాచ్ సందర్భంగా పూర్తి భిన్నమైన లావెండర్ జెర్సీతో కనిపించారు. నిజానికి గుజరాత్ జట్టు జెర్సీ రంగు శాశ్వతంగా మారలేదు. లావెండర్ రంగు అన్నది నిన్నటి మ్యాచ్ కే పరిమితం. కేన్సర్ పై అవగాహన కల్పించేందుకు వారు లావెండర్ రంగు జెర్సీ వేసుకున్నారు. ఈ రంగు కేన్సర్ కు గుర్తుగా పేర్కొంటారు. వాస్తవానికి ఈసోఫాజియల్ (అన్నవాహిక) కేన్సర్ కు ఇది గుర్తు కాగా, ఆ తర్వాత అన్ని రకాల కేన్సర్లకు లావెండర్ రంగును అధికారికం చేశారు. 

గుజరాత్ టైటాన్స్ జట్టు అనే కాదు, 2015లో ఢిల్లీ క్యాపిటల్స్ కూడా ఇదే రంగు జెర్సీని ధరించింది. మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ చొరవతో అప్పుడు ఆ ప్రయత్నం చేశారు. ఎందుకంటే యువరాజ్ సింగ్ కూడా కేన్సర్ ను జయించిన వాడే. 

  • Loading...

More Telugu News