New Delhi: ఢిల్లీని ముంచెత్తుతున్న దుమ్ము గాలులు.. దారుణంగా పెరుగుతున్న కాలుష్యం.. వీడియో ఇదిగో!

Dust winds in Delhi increase pollution levels and reduce visibility

  • క్షీణించిన గాలి నాణ్యత
  • పడిపోతున్న విజిబిలిటీ
  • ఉదయం ఆరు గంటల నుంచే దుమ్ముతో కూడిన బలమైన గాలులు

దుమ్ముతో కూడిన గాలులు ఢిల్లీని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఈ గాలుల కారణంగా దేశ రాజధానిలో కాలుష్య స్థాయులు ఒక్కసారిగా పెరిగిపోయి గాలి నాణ్యత క్షీణించింది. సిస్టం ఆఫ్ ఎయిర్ క్వాలిటీ అండ్ వెదర్ ఫోర్‌కాస్టింగ్ అండ్ రీసెర్చ్ (ఎస్‌ఏఎఫ్ఏఆర్) ప్రకారం మొత్తంగా గాలి నాణ్యత సూచీ (ఏక్యూఐ) 134 గా మోటరేట్ కేటగిరీలో నమోదైంది. ఢిల్లీ ఎన్‌సీఆర్ పరిధిలో ఉదయం ఆరు గంటల నుంచే దుమ్ముతో కూడిన బలమైన గాలులు వీస్తున్నాయి. దీంతో విజిబిలిటీ (కంటిచూపు దూరం) 1100 మీటర్లకు పడిపోయింది.

అందుబాటులో ఉన్న గణాంకాల ప్రకారం చాలా స్టేషన్లలో పీఎం 10 స్థాయులు చాలా ఎక్కువగా ఉన్నాయి. అలాగే, ఇండియా గేట్, ప్రతాప్‌గంజ్, పుసాలలో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ దారుణంగా నమోదైంది. రాజస్థాన్ మీదుగా ఆవరించిన తుపాను ప్రభావంతోనే ఢిల్లీలో దుమ్ము రేగుతున్నట్టు నిపుణులు అభిప్రాయపడుతున్నారు. తుపాను ప్రభావంతో ఉత్తర రాజస్థాన్‌లో దుమ్ముతో కూడిన గాలులతో పాటు తేలికపాటి వర్షాలు కురుస్తున్నాయి. ఈ ప్రభావం వచ్చే మూడు నాలుగు రోజుల్లో రాజస్థాన్, ఢిల్లీ, హర్యానాతోపాటు పంజాబ్‌లోని కొన్ని ప్రాంతాల్లోనూ దశల వారీగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.

  • Loading...

More Telugu News