Sampath Raj: జీ5లో స్ట్రీమింగ్ అవుతున్న‌ 'వ్య‌వ‌స్థ' ..150 మిలియన్స్ వ్యూయింగ్ మినిట్స్‌తో కొత్త రికార్డ్!

Vyavastha Web Series

  • జీ 5లో స్ట్రీమింగ్ అవుతున్న 'వ్యవస్థ'
  • కథాకథనాల పరంగా కనెక్ట్ అయిన సిరీస్ 
  • సంపత్ రాజ్ నటన హైలైట్
  • సక్సెస్ మీట్ ను నిర్వహించిన టీమ్

వైవిధ్య‌భరితమైన కంటెంట్‌ను అందిస్తూ ఆడియన్స్ హృద‌యాల్లో త‌న‌దైన స్థానాన్ని ద‌క్కించుకున్న ఓటీటీ మాధ్య‌మం జీ 5. తాజాగా దీని స్ట్రీమింగ్ లైబ్ర‌రీలో చేరిన ఒరిజిన‌ల్ ‘వ్యవస్థ’. ఈ థ్రిల్లింగ్ కోర్టు రూమ్ డ్రామా ఆడియన్స్‌ను ఆక‌ట్టుకుంటూ దూసుకెళ్తోంది. ఆనంద్ రంగ దర్శకత్వం వహించిన ఈ సిరీస్, ఇప్ప‌టికే 150 మిలియ‌న్ వ్యూయింగ్ మినిట్స్‌తో దూసుకెళ్తోంది.
 
ఈ సంద‌ర్బంగా 'వ్య‌వ‌స్థ' టీమ్ స‌క్సెస్ మీట్‌ను నిర్వ‌హించింది. హీరో సందీప్ కిషన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సందీప్ కిష‌న్ మాట్లాడుతూ ‘వ్యవస్థ'లో వర్క్ చేసిన వారందరూ చాలా కావాల్సినవారే. సంపత్‌గారితో క‌లిసి సినిమా చేయాల‌ని ఎదురు చూస్తున్నాను. అలాగే కామ్నా జెఠ్మ‌లానీతో నేను అసిస్టెంట్ డైరెక్ట‌ర్‌గా ఉన్న‌ప్ప‌టి నుంచి ప‌రిచ‌యం ఉంది. హెబ్బా ప‌టేల్‌కి కంగ్రాట్స్. కార్తీక్ ర‌త్నం అంటే చాలా ఇష్టం. త‌ను 'వ్య‌వ‌స్థ‌'లో పోషించిన తీరు అద్భుతం. జీ5కి అభినంద‌న‌లు.. వారు కంటెంట్‌ను ప్ర‌జ‌ల్లోకి తీసుకెళ్లే తీరు బావుంది.150 మిలియన్స్ వ్యూయింగ్ మినిట్స్‌తో ఆద‌రిస్తోన్న ప్రేక్ష‌కుల‌కు థాంక్స్‌’’ అన్నారు.

కార్తీక్ రత్నం మాట్లాడుతూ ‘‘సందీప్ కిషనన్న‌ను క‌లిసి త‌ర్వాత ఆయ‌న నాకు ఎప్పుడూ తిరుగులేని స‌పోర్ట్‌ను అందిస్తూనే ఉన్నారు. ఆనంద్ రంగాగారితో క‌లిసి ప‌ని చేయ‌టం ఎంతో ఆనందంగా ఉంది. ప‌ట్టాభిగారు చాలా ధైర్యం చేసి తీశారు. సంప‌త్ రాజ్‌, అనిల్ సార్ అంద‌రికీ థాంక్స్‌. హెబ్బా ప‌టేల్‌, కామ్నా జెఠ్మ‌లానీతో క‌లిసి వ‌ర్క్ చేయ‌టం చాలా ఆనందంగా ఉంది. ఎంటైర్ టీమ్‌కి థాంక్స్‌. జీ 5వారు చేస్తోన్న స‌పోర్ట్ మ‌ర‌చిపోలేం. 
సంప‌త్ రాజ్ మాట్లాడుతూ ‘‘నాపై నమ్మకంతో నాకీ అవకాశాన్ని ఇచ్చిన ఆనంద్ రంగాగారికి థాంక్స్‌. వెంక‌ట్‌, పట్టాభిగారు స‌హా డైరెక్ష‌న్ టీమ్‌కి ధ‌న్య‌వాదాలు. వ్య‌వ‌స్థ చేసే ముందు చాలామంది ఎందుకు చేస్తున్నావ‌ని అడిగారు. అయితే నాకు స్క్రిప్ట్‌పై నమ్మ‌కం ఉంద‌ని చెప్పాను. ఇదొక స్లో బ‌ర్న‌ర్‌లా ఆడియన్స్‌కి క‌నెక్ట్ అయ్యింది. కంటెంట్ బావుంటే ఆడియెన్స్ ఆద‌రిస్తార‌ని మ‌రోసారి 'వ్య‌వ‌స్థ' ప్రూవ్ చేసింది. జీ 5 మార్కెటింగ్ స్ట్రాట‌జీతో దీన్ని సూప‌ర్ సక్సెస్ చేశారు’’ అన్నారు

జీ 5 తెలుగు ఒరిజిన‌ల్ కంటెంట్ హెడ్‌, వైస్ ప్రెసిడెంట్ సాయితేజ దేశ్ రాజ్ మాట్లాడుతూ ‘‘20 రోజుల ముందే చెప్పాం. వ్యవస్థతో హిట్ ఇస్తామని. హిట్ కాదు.. జీ5కిది సమ్మర్ బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. ఇంత మంచి విజ‌యాన్ని అందించిన తెలుగు ప్రేక్ష‌కుల‌కు థాంక్స్‌" అని  చెప్పారు. ద‌ర్శ‌కుడు ఆనంద్ రంగ మాట్లాడుతూ ‘‘నా టీమ్‌ను నా ఫ్యామిలీగా భావించి వర్క్ చేశాను. అందుక‌నే మంచి ఔట్‌పుట్ వ‌చ్చింది. కంటెంట్ మీ ముందే ఉంది. ఇక మీరే చూసి ఎంజాయ్ చేయాలి’’ అన్నారు.

  • Loading...

More Telugu News