hottest period: వచ్చే ఐదేళ్లూ ఎండల తీవ్రత ఎక్కువే: ఐక్యరాజ్యసమితి
- 2023-27 హాటెస్ట్ పీరియడ్ గా పేర్కొన్న ఐక్యరాజ్యసమితి
- ఏదో ఒక ఏడాది మాత్రం ఎండలు దంచికొడతాయని అంచనా
- ఆరోగ్యంపై దుష్ప్రభావాలు చూపిస్తాయని హెచ్చరిక
ఏటేటా వేసవిలో ఎండల తీవ్రత పెరుగుతూ పోతోంది. ఈ ఏడాది ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయికి చేరుకోగా, ఇలా ఐదేళ్ల పాటు ప్రపంచవ్యాప్తంగా అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయని ఐక్యరాజ్యసమితి వాతావరణ విభాగం ప్రకటించింది. 2023-27 కాలాన్ని అత్యంత వేడితో కూడిన ఐదేళ్ల కాలంగా పేర్కొంది. 2016లో నమోదైన అత్యంత గరిష్ఠ ఉష్ణోగ్రతల రికార్డు కూడా చెరిగిపోవచ్చని అంచనా వేసింది. ఈ ఐదేళ్లలో ఏదో ఒక ఏడాది అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదు కావచ్చని పేర్కొంది.