Container: రోడ్డుపై నిలిచిపోయిన ట్రక్కులు.. వాటిల్లో రూ.1,070 కోట్ల కరెన్సీ
- చెన్నైలోని తాంబరం వద్ద చోటు చేసుకున్న ఘటన
- రూ.535 కోట్లను తీసుకెళుతున్న ట్రక్కులో సమస్య
- దాన్ని తిరిగి చెన్నైకి పంపించే ఏర్పాట్లు
తమిళనాడులో ఊహించని పరిణామం చోటు చేసుకుంది. ఆర్బీఐ నుంచి బ్యాంకులకు వెళుతున్న కరెన్సీ ట్రక్కులు ఉన్నట్టుండి నిలిచిపోయాయి. దీంతో అధికారులు ఉలిక్కిపడ్డారు. ఆర్ బీఐ చెన్నై శాఖ రెండు ట్రక్కుల్లో రూ.1,070 కోట్లను విల్లుపురానికి పంపించింది. రెండు ట్రక్కులు ఈ కరెన్సీ కట్టలతో విల్లుపురానికి బయల్దేరాయి. అక్కడి నుంచి జిల్లాలోని బ్యాంకులకు కరెన్సీ పంపిణీ జరగాల్సి ఉంది.