Rajinikanth: ఒకే ఫ్రేమ్ లో రజనీకాంత్, కపిల్ దేవ్... ఏ సినిమాలో అంటే...!

Rajinikanth and Kapildev acts in Aishwarya directorial venture Lal Salam movie
  • లాల్ సలామ్ చిత్రాన్ని తెరకెక్కిస్తున్న రజనీ కుమార్తె ఐశ్వర్య
  • అతిథి పాత్రల్లో రజనీకాంత్, కపిల్ దేవ్
  • సెట్స్ పై సందడి చేసిన దిగ్గజాలు
  • కపిల్ తో కలిసి వెండితెరపై కనిపించడం తనకు దక్కిన గౌరవమన్న రజనీ
రజనీకాంత్... సూపర్ స్టార్ అనే పదానికి సరైన పర్యాయపదం. కపిల్ దేవ్... భారత క్రికెట్ దశ దిశ మార్చేసిన ఒరిజినల్ లెజెండ్. వీరిద్దరూ కలిసి వెండితెరపై ఒకే ఫ్రేమ్ లో కనిపిస్తే అది నిజంగా అద్భుతంగా ఉంటుంది. 

తలైవా రజనీకాంత్ కుమార్తె ఐశ్వర్య దర్శకురాలిగా 'లాల్ సలామ్' చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఇందులో యువ హీరోలు విష్ణు విశాల్, విక్రాంత్ ప్రధానపాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రంలో రజనీకాంత్, కపిల్ దేవ్ కూడా అతిథిపాత్రల్లో తళుక్కున మెరవనున్నారు. 

తాజాగా రజనీ, కపిల్ 'లాల్ సలామ్' సెట్స్ పై సందడి చేశారు. దీనికి సంబంధించిన ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో సందడి చేస్తున్నాయి. కపిల్ దేవ్ తో వెండితెరను పంచుకోవడం పట్ల రజనీకాంత్ స్పందించారు. భారత్ కు తొలి వరల్డ్ కప్ అందించిన కపిల్ దేవ్ అంతటి అత్యంత గౌరవనీయమైన, మహోన్నత వ్యక్తితో కలిసి పనిచేయడం తనకు దక్కిన గౌరవంగా భావిస్తున్నానని తెలిపారు. 

'లాల్ సలామ్' చిత్రం క్రికెట్ నేపథ్యంలో రూపుదిద్దుకుంటున్నట్టు తెలుస్తోంది. ఇందులో రజనీకాంత్ మొయిదీన్ భాయ్ అనే పాత్ర పోషిస్తున్నట్టు సమాచారం.
Rajinikanth
Kapil Dev
Lal Salam
Cameo
Aishwarya

More Telugu News