Kerala: చొక్కా జేబులో పేలిపోయిన ఫోన్

Elderly Kerala man has a narrow escape as mobile phone explodes in his shirt pocket Video

  • కేరళలోని త్రిస్సూర్ జిల్లాలో ఘటన
  • చేతులతో దులిపేసుకోవడంతో కింద పడిపోయిన ఫోన్
  • మంటలు ఆర్పేయడంతో తప్పిన ప్రమాదం

సెల్ ఫోన్ విషయంలో ఎంత జాగ్రత్తగా ఉండాలో ఈ ఘటన తెలియజేస్తోంది. సెల్ ఫోన్ల విషయంలో చాలా మంది నిర్లక్ష్యం ప్రదర్శిస్తుంటారు. తరచూ చార్జింగ్ పెడుతుండడం, బ్యాటరీ జీవిత కాలం ముగిసినా దాన్నే వినియోగిస్తుండడం చేస్తుంటారు. ఇలాంటి చర్యలు ప్రమాదాన్ని తీసుకొస్తాయన్న అవగాహన కూడా ఉండడం లేదు. దీనికితోడు కొన్ని ఫోన్లలో ఏర్పడిన ఇతర సమస్యలు సైతం అవి పేలిపోవడానికి కారణమవుతున్నాయి. 

కేరళలోని త్రిస్సూర్ జిల్లాలో ఇలాంటి సెల్ ఫోన్ ప్రమాదమే ఒకటి జరిగింది. 70 ఏళ్ల పెద్దాయన ఓ హోటల్లో కూర్చుని ఏదో తింటున్నాడు. ఆయన చొక్కా జేబులో సెల్ ఫోన్ పెట్టుకున్నారు. ఉన్నట్టుండి అది పేలిపోయి మంటలు వచ్చాయి. వెంటనే ఆయన రెండు చేతులతో దులిపేసుకోవడంతో సెల్ ఫోన్ కింద పడిపోయింది. జేబు ప్రాంతంలో చొక్కా కాలిపోయింది. అక్కడే ఉన్న మరో వ్యక్తి నీళ్లు చల్లి సెల్ ఫోన్ మంటను ఆర్పేశాడు. అప్రమత్తం  కావడంతో పెద్ద ప్రమాదం తప్పినట్టయింది. కనుక సెల్ ఫోన్ నిర్వహణ విషయంలోనూ జాగ్రత్తలు తప్పనిసరి. 

  • Loading...

More Telugu News