Bro: రికార్డు స్థాయి వ్యూస్ తో దూసుకెళుతున్న పవన్ కల్యాణ్ 'బ్రో' మోషన్ పోస్టర్

Bro motion poster hits record level views

  • పవన్, సాయిధరమ్ తేజ్ ప్రధాన పాత్రల్లో 'బ్రో'
  • సముద్రఖని దర్శకత్వంలో చిత్రం
  • నిన్న టైటిల్ వెల్లడి... మోషన్ పోస్టర్ విడుదల
  • 20 గంటల్లో 4 మిలియన్లకు పైగా వ్యూస్

మామాఅల్లుళ్లు పవన్ కల్యాణ్, సాయిధరమ్ తేజ్ ప్రధాన పాత్రల్లో, సముద్రఖని దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం 'బ్రో'. నిన్ననే ఈ సినిమా టైటిల్ అనౌన్స్ చేయడంతో పాటు పవన్ లుక్ తో మోషన్ పోస్టర్ కూడా రిలీజ్ చేశారు. కాగా, ఈ మోషన్ పోస్టర్ రికార్డులు కొల్లగొడుతోందని దర్శకుడు సముద్రఖని వెల్లడించారు. 

విడుదలైన 20 గంటల 20 నిమిషాల్లో 'బ్రో' మోషన్ పోస్టర్ 4.74 మిలియన్లకు పైగా వ్యూస్ నమోదు చేసిందని వివరించారు. టాలీవుడ్ ఫిలిం ఇండస్ట్రీలో అతి తక్కువ సమయంలో అత్యధికులు వీక్షించిన మోషన్ పోస్టర్ ఇదేనని పేర్కొన్నారు. 'బ్రో' చిత్రంలో పవన్ భగవంతుడి పాత్ర పోషిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ చిత్రాన్ని జీ స్టూడియోస్ తో కలిసి టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్నారు.

  • Loading...

More Telugu News