Boris Johnson: లేటు వయసులో 8వ బిడ్డకు తండ్రి కాబోతున్న బ్రిటన్ మాజీ ప్రధాని!

Boris Johnson Set To Become A Father For The Eighth Time At 58

  • తాను మరోసారి తల్లి కాబోతున్నట్లు ప్రకటించిన క్యారీ సిమండ్స్‌
  • మూడు పెళ్లిళ్లు చేసుకున్న బోరిస్.. ఇద్దరికి విడాకులు
  • రెండో భార్యకు నలుగురు పిల్లలు.. మూడో భార్యకు ఇప్పటికే ఇద్దరు
  • హెలెన్ మాకిన్‌టైర్‌ అనే వ్యక్తితో ఎఫైర్ తో మరో బిడ్డ

లేటు వయసులో 8వ బిడ్డకు తండ్రి కాబోతున్నారు బ్రిటన్ మాజీ ప్రధాని బోరిస్ జాన్సన్. 58 ఏళ్ల బోరిస్ కు ముగ్గురు భార్యల ద్వారా ఏడుగురు పిల్లలు ఉన్నారు. తాజాగా మూడో భార్య క్యారీ సిమండ్స్ తాను మరోసారి తల్లి కాబోతున్నట్లు సోషల్ మీడియా ద్వారా ప్రకటించారు.  

35 ఏళ్ల క్యారీ సిమండ్స్‌తో బోరిస్‌ కొన్నేళ్లు సహజీనం చేశారు. తర్వాత 2021 మే నెలలో వివాహం చేసుకున్నారు. వీరికి ఇప్పటికే ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఏప్రిల్‌ 2020లో విల్ఫ్ జన్మించగా.. డిసెంబర్‌ 2021లో రోమీ జన్మించాడు. ఇప్పుడు క్యారీ మూడో బిడ్డకు జన్మనివ్వబోతున్నారు. మరి కొన్ని వారాల్లో తమ కుటుంబంలోకి మరో వ్యక్తి రాబోతున్నాడంటూ ఆమె ఇన్ స్టాగ్రామ్ లో ప్రకటించారు. తన ఇద్దరు పిల్లలతో ఉన్న ఫొటోను షేర్ చేశారు. 

బోరిస్‌ జాన్సన్‌ తొలుత 1987లో కళాకారిణి, జర్నలిస్టు అలెగ్రా మోస్టిన్‌ ఓవెను వివాహం చేసుకున్నారు. అయితే 1993లో వారిద్దరూ విడిపోయారు. వీరికి సంతానం కలగలేదు. 1993లో భారత సంతతికి చెందిన న్యాయవాది, జర్నలిస్టు మెరీనా వీలర్‌ ను పెళ్లాడారు.

25 ఏళ్ల వైవాహిక జీవితం తర్వాత విడాకులు తీసుకుంటున్నట్లు జాన్సన్-వీలర్‌ 2018లో ప్రకటించారు. 2020లో ఈ విడాకుల తంతు పూర్తయ్యింది. వీరికి నలుగురు పిల్లలు ఉన్నారు. ప్రముఖ వార్తాసంస్థ బీబీసీ ప్రకారం.. ఆర్ట్ కన్సల్టెంట్ హెలెన్ మాకిన్‌టైర్‌ తో ఎఫైర్ కారణంగా బోరిస్‌కు మరో బిడ్డ ఉన్నాడు.

  • Loading...

More Telugu News