Indian cities: స్ట్రీట్ ఫుడ్ లో ఈ రెండు భారత పట్టణాలకు అంతర్జాతీయ గుర్తింపు
- వరల్డ్ టాప్ 100లో ఢిల్లీ, ముంబై
- ఢిల్లీకి 16, ముంబైకి 34వ స్థానం
- ఢిల్లీలో ఛోలే బాచుర్, బటర్ చికెన్, ఆలూ టిక్కి ఫేమస్
- ముంబైలో వడా పావ్, పావ్ బాజీ, భేల్ పూరి పాప్యులర్
రుచికరమైన పదార్థాల పట్ల పట్టణ వాసులు మక్కువ చూపిస్తుంటారు. మంచి స్ట్రీట్ ఫుడ్ (వీధి ఆహారం) ఎక్కడ లభిస్తే అక్కడ రద్దీ విపరీతంగా కనిపిస్తుంది. పర్యాటకులు ఎక్కడికి వెళ్లినా అక్కడ మాత్రమే ప్రత్యేకంగా లభించే స్ట్రీట్ ఫుడ్ కు ప్రాధాన్యం ఇస్తుంటారు. మన దేశంలో స్ట్రీట్ ఫుడ్ పరంగా రెండు పట్టణాలకు అంతర్జాతీయ గుర్తింపు లభించింది. ప్రపంచవ్యాప్తంగా లోకల్ ఫుడ్ పరంగా పేరొందిన టాప్ 100 పట్టణాల జాబితాను ఇంటర్నేషనల్ ట్రావెల్ ఆన్ లైన్ గైడ్ కంపెనీ ‘టేస్ట్ అట్లాస్’ విడుదల చేసింది.