CSK: గెలిస్తేనే నిలుస్తారు... చిచ్చరపిడుగుల్లా ఆడిన సీఎస్కే ఓపెనర్లు

CSK openers gives brisk start to team

  • చెన్నై సూపర్ కింగ్స్ × ఢిల్లీ క్యాపిటల్స్
  • టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న చెన్నై
  • 20 ఓవర్లలో 3 వికెట్లకు 223 పరుగులు
  • తొలి వికెట్ కు 141 పరుగులు జోడించిన గైక్వాడ్, కాన్వే
  • ఫోర్లు, సిక్సర్లతో హోరెత్తించిన వైనం
  • మెరుపు ఇన్నింగ్స్ ఆడిన శివమ్ దూబే, జడేజా

ఐపీఎల్ ప్లే ఆఫ్ బెర్తు దక్కించుకోవాలంటే తప్పక నెగ్గాల్సిన మ్యాచ్ లో చెన్నై సూపర్ కింగ్స్ ఓపెనర్లు డెవాన్ కాన్వే, రుతురాజ్ గైక్వాడ్ విధ్వంసక ఆటతీరుతో అలరించారు. వీరికి తోడు శివమ్ దూబే, రవీంద్ర జడేజా కూడా రెచ్చిపోవడంతో చెన్నై సూపర్ కింగ్స్ భారీ స్కోరు సాధించింది. ఢిల్లీ క్యాపిటల్స్ తో మ్యాచ్ లో టాస్ గెలిచిన సీఎస్కే నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్లకు 223 పరుగులు నమోదు చేసింది. 

గైక్వాడ్, కాన్వే జోడీ తొలి వికెట్ కు 14.3 ఓవర్లలో 141 పరుగులు జోడించడం విశేషం. గైక్వాడ్ 50 బంతుల్లో 3 ఫోర్లు, 7 సిక్సులు బాది 79 పరుగులు చేయగా... కాన్వే 52 బంతుల్లో 11 ఫోర్లు, 3 సిక్సులు కొట్టి 87 పరుగులు సాధించాడు. 

గైక్వాడ్ అవుట్ కావడంతో వన్ డౌన్ లో వచ్చిన శివమ్ దూబే కేవలం 9 బంతులాడి 3 సిక్సర్లతో 22 పరుగులు నమోదు చేయగా... రవీంద్ర జడేజా 7 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్స్ తో 20 పరుగులతో అజేయంగా నిలిచాడు. ఆఖర్లో వచ్చిన కెప్టెన్ ధోనీ 4 బంతుల్లో 5 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు. ఢిల్లీ క్యాపిటల్స్ బౌలర్లలో ఖలీల్ అహ్మద్ 1, ఆన్రిచ్ నోర్కియా 1, చేతన్ సకారియా 1 వికెట్ తీశారు. 

సొంతగడ్డపై ఆడుతున్నప్పటికీ ఢిల్లీ క్యాపిటల్స్ బౌలర్లు ఏమాత్రం ప్రభావం చూపలేకపోయారు. మొదటి నుంచి సీఎస్కే బ్యాట్స్ మెన్ దూకుడు ప్రదర్శించడంతో ఢిల్లీ బౌలర్లు బెంబేలెత్తిపోయారు.

  • Loading...

More Telugu News