Siddaramaiah: సీఎంగా సిద్ధరామయ్య తొలి సంతకం దేనిపై అంటే...!

Siddaramaiah take oath and sign on five assurances

  • కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘనవిజయం
  • నేడు సీఎంగా ప్రమాణస్వీకారం చేసిన సిద్ధరామయ్య
  • విధాన సౌధలో తొలి క్యాబినెట్ సమావేశం
  • ఐదు హామీల అమలుకు ఆదేశాలు ఇచ్చినట్టు సిద్ధరామయ్య వెల్లడి

కర్ణాటక ఎన్నికల్లో కాంగ్రెస్ గెలవడానికి బీజేపీపై వ్యతిరేకతతో పాటు 5 హామీలు కూడా ప్రభావం చూపాయి. ఇవాళ సీఎంగా పదవీప్రమాణం చేసి సిద్ధరామయ్య తొలి సంతకం చేసింది కూడా ఈ ఐదు హామీల ఫైలు పైనే. తద్వారా ప్రజలకు కాంగ్రెస్ పార్టీ  ఇచ్చిన మాటను నిలుపుకునే ప్రయత్నం చేశారు. ఈ మధ్యాహ్నం బెంగళూరులో కర్ణాటక నూతన ముఖ్యమంత్రి ప్రమాణస్వీకారోత్సవం ఘనంగా జరిగింది. 

ఈ కార్యక్రమం అనంతరం విధాన సౌధలో నూతన సీఎం సిద్ధరామయ్య తొలి క్యాబినెట్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, 5 హామీల అమలుకు ఆదేశాలు ఇచ్చినట్టు వెల్లడించారు. 

మేనిఫెస్టోలో కాంగ్రెస్ పేర్కొన్న 5 హామీలు ఇవే...

1. గృహలక్ష్మి పథకం కింద ఇంటి పెద్ద అయిన మహిళలకు నెలకు రూ.2 వేలు
2. గృహజ్యోతి పథకం ద్వారా గృహావసరాల కోసం 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్
3. యువ నిధి పథకంలో భాగంగా నిరుద్యోగ పట్టభద్రులకు రూ.3,000... డిప్లమో హోల్డర్లకు రూ.1,500 చొప్పున భృతి
4. అన్న భాగ్య పథకం ద్వారా బీపీఎల్ కార్డులో ఉన్న ఇంటి సభ్యులకు రూ.10 కిలోల చొప్పున ఉచితంగా బియ్యం
5. ఉచిత ప్రయాణం పథకం ద్వారా ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సదుపాయం

  • Loading...

More Telugu News