Nicholas Pooran: పూరన్ ఎదురుదాడి... లక్నో జట్టుకు గౌరవప్రదమైన స్కోరు
- ఈడెన్ గార్డెన్స్ లో నైట్ రైడర్స్ × లక్నో సూపర్ జెయింట్స్
- టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన లక్నో
- 20 ఓవర్లలో 9 వికెట్లకు 176 పరుగులు
- 30 బంతుల్లో 58 పరుగులు చేసిన పూరన్
- 4 ఫోర్లు, 5 సిక్సులతో వీరవిహారం
కోల్ కతా నైట్ రైడర్స్ తో పోరులో మొదట బ్యాటింగ్ చేసిన లక్నో సూపర్ జెయింట్స్ గౌరవప్రదమైన స్కోరు సాధించింది. నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లకు 176 పరుగులు సాధించింది. 73 పరుగులకే 5 వికెట్లు కోల్పోయిన దశలో నికోలాస్ పూరన్ ఎదురుదాడి చేయడంతో ఆ మాత్రం స్కోరైనా వచ్చింది. పూరన్ 30 బంతుల్లోనే 4 ఫోర్లు, 5 సిక్సర్లతో 58 పరుగులు చేశాడు.
మార్కస్ స్టొయినిస్ (0), కెప్టెన్ కృనాల్ పాండ్యా (9) విఫలం కావడం లక్నో భారీ స్కోరు అవకాశాలను దెబ్బతీసింది. అంతకుముందు, ఓపెనర్ కరణ్ శర్మ 3, మరో ఓపెనర్ డికాక్ 28, ప్రేరక్ మన్కడ్ 26 పరుగులు చేసి అవుటయ్యారు.
పూరన్ కు యువ ఆటగాడు ఆయుష్ బదోని నుంచి సహకారం లభించింది. బదోని 25 పరుగులు చేశాడు. కోల్ కతా నైట్ రైడర్స్ బౌలర్లలో వైభవ్ అరోరా 2, శార్దూల్ ఠాకూర్ 2, సునీల్ నరైన్ 2, హర్షిత్ రాణా 1, వరుణ్ చక్రవర్తి 1 వికెట్ తీశారు.