Vijay Antony: తెలుగు రాష్ట్రాల్లో 3 రోజుల్లో 'బిచ్చగాడు 2' రాబట్టిన వసూళ్లు ఇవే!

Bichagadu 2 movie update
  • విజయ్ ఆంటోని హీరోగా 'బిచ్చగాడు 2'
  • ఈ నెల 19వ తేదీన విడుదలైన సినిమా 
  • 3 రోజుల్లో 9.5 కోట్ల గ్రాస్ వసూలు 
  • వీకెండ్ తరువాత కూడా నిలబడిన సినిమా
విజయ్ ఆంటోని కథానాయకుడిగా 'బిచ్చగాడు 2' సినిమా రూపొందింది. ఈ నెల 19వ తేదీన ఈ సినిమా విడుదలైంది. తొలి రోజునే ఈ సినిమా సక్సెస్ టాక్ తెచ్చుకుంది. 3 రోజుల్లో ఈ సినిమా 9.5 కోట్ల గ్రాస్ ను వసూలు చేసింది. ఈ విషయాన్ని అధికారికంగా తెలియజేస్తూ, అందుకు సంబంధించిన పోస్టర్ ను కొంతసేపటి క్రితం రిలీజ్ చేశారు.
 
గతంలో విజయ్ ఆంటోని నుంచి వచ్చిన 'బిచ్చగాడు' భారీ విజయాన్ని  నమోదు చేయడంతో, సహజంగానే 'బిచ్చగాడు 2' పై అంచనాలు భారీగా ఉన్నాయి. ఇంతకుముందు వచ్చిన 'బిచ్చగాడు' సినిమాకి శశి దర్శకత్వం వహించాడు .. ఎడిటింగ్ కూడా వేరేవారు చేశారు. 

కానీ ఈ సారి మాత్రం దర్శకత్వం .. ఎడిటింగ్ బాధ్యతలను కూడా విజయ్ ఆంటోనినే నిర్వహించాడు. హీరోగానే కాకుండా మిగతా విభాగాల్లోను ఆయన అద్భుతమైన పనితీరును కనబరిచాడు. ఇక మరో వైపున ఈ సినిమా తమిళంలోను ఒక రేంజ్ లో దూసుకుపోతోందని అంటున్నారు. మొత్తానికి చాలా గ్యాప్ తరువాత విజయ్ ఆంటోని పెద్ద హిట్ నే కొట్టాడు. 
Vijay Antony
KavyaThapar
Bichagadu Movie

More Telugu News