Sensex: లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు.. బ్యాంకింగ్ కంపెనీలకు నష్టాలు
- మార్కెట్లను ముందుండి నడిపించిన ఐటీ, టెక్ సూచీలు
- 234 పాయింట్లు లాభపడ్డ సెన్సెక్స్
- 111 పాయింట్లు పెరిగిన నిఫ్టీ
దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు లాభాల్లో ముగిశాయి. ట్రేడింగ్ ను నష్టాలతో ప్రారంభించిన మార్కెట్లు... ఆ తర్వాత కొనుగోళ్ల అండతో కోలుకున్నాయి. ఐటీ, టెక్ సూచీలు మార్కెట్లను ముందుండి నడిపించాయి. ఈ క్రమంలో ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 234 పాయింట్లు లాభపడి 61,964కి పెరిగింది. నిఫ్టీ 111 పాయింట్లు పుంజుకుని 18,314కి చేరుకుంది. ఈనాటి ట్రేడింగ్ లో బ్యాంకింగ్, ఫైనాన్స్ సూచీలు నష్టాలను మూటకట్టుకున్నాయి.
బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
టెక్ మహీంద్రా (3.03%), విప్రో (2.50%), టీసీఎస్ (2.37%), హెచ్సీఎల్ టెక్నాలజీస్ (2.18%), ఇన్ఫోసిస్ (1.91%).
టాప్ లూజర్స్:
నెస్లే ఇండియా (-1.15%), యాక్సిస్ బ్యాంక్ (-0.79%), భారతి ఎయిర్ టెల్ (-0.50%), టాటా మోటార్స్ (-0.46%), హెచ్డీఎఫ్సీ లిమిటెడ్ (-0.43%).