Manish Sisodia: మనీశ్ సిసోడియా జ్యుడీషియల్ కస్టడీ పొడిగింపు
- ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న సిసోడియా
- జూన్ 1 వరకు జ్యుడీషియల్ కస్టడీని పొడిగించిన కోర్టు
- సిసోడియాకు జైల్లో కుర్చీ, టేబుల్, పుస్తకాలు ఇవ్వాలని ఆదేశం
లిక్కర్ స్కామ్ కేసులో ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా జ్యుడీషియల్ కస్టడీని జూన్ 1వ తేదీ వరకు స్థానిక కోర్టు పొడిగించింది. ఈ సందర్భంగా జైలు అధికారులకు కోర్టు కీలక ఆదేశాలను జారీ చేసింది. సిసోడియాకు జైల్లో ఒక కుర్చీని, టేబుల్ ని, పుస్తకాలను సమకూర్చాలని ఆదేశించింది.
మరోవైపు కోర్టు హాలు బయటకు వస్తున్న సమయంలో మీడియాతో సిసోడియా మాట్లాడుతూ... ప్రధాని మోదీకి ప్రజాస్వామ్యంపై నమ్మకం లేదని విమర్శించారు. మోదీలో అహంకారం పెరిగిపోయిందని అన్నారు. 2021 నవంబర్ 17న ఢిల్లీలోని ఆప్ ప్రభుత్వం కొత్త లిక్కర్ పాలసీని తీసుకొచ్చింది. అయితే, అవినీతి ఆరోపణల నేపథ్యంలో 2022 సెప్టెంబర్ లో ఆ పాలసీని రద్దు చేసింది. లిక్కర్ స్కామ్ లో సీబీఐ, ఈడీ రెండూ సిసోడియాను నిందితుడిగా చేర్చాయి.