Chinthamaneni Prabhakar: అవినాశ్ రెడ్డి విషయంలో సీబీఐ కఠిన వైఖరిని అవలంబించకపోవడానికి కారణం ఇదే: చింతమనేని

There is understanding between union and AP state government says Chinthamaneni Prabhakar

  • కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వం మధ్య ఇచ్చిపుచ్చుకునే ధోరణి ఉందన్న చింతమనేని
  • అవినాశ్ ను సీబీఐ అరెస్ట్ చేయకపోవడం సిగ్గుచేటని విమర్శ
  • సీబీఐని సజ్జల కూడా బెదిరిస్తున్నారని మండిపాటు

కేంద్ర ప్రభుత్వానికి, రాష్ట్రంలోని వైసీపీ ప్రభుత్వానికి మధ్య ఇచ్చిపుచ్చుకునే ధోరణి ఉందని టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ఆరోపించారు. ఈ ధోరణి వల్లే వైఎస్ అవినాశ్ రెడ్డిని అరెస్ట్ చేసే అంశంలో సీబీఐ కఠిన వైఖరిని అవలంబించడం లేదని అన్నారు. అవినాశ్ ను సీబీఐ అరెస్ట్ చేయలేకపోవడం సిగ్గుచేటని అన్నారు. సీబీఐని సజ్జల రామకృష్ణారెడ్డి కూడా బెదిరిస్తున్నారని ఆరోపించారు. చింతమనేని ఆధ్వర్యంలో ఏలూరు విద్యుత్ భవన్ ఎదుట టీడీపీ శ్రేణులు ఈరోజు ధర్నా చేపట్టాయి. పెంచిన విద్యుత్ ఛార్జీలను వెంటనే తగ్గించాలని ఈ సందర్భంగా వారు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా చింతమనేని మీడియాతో మాట్లాడుతూ పైవ్యాఖ్యలు చేశారు.

  • Loading...

More Telugu News