Ram Charan: ప్రతిష్ఠాత్మక జీ20 సదస్సులో పాల్గొనడంపై రామ్ చరణ్ స్పందన

Ram Charan opines on participating in G20 Summit

  • ఇటీవల శ్రీనగర్ లో జీ20 సదస్సు
  • హాజరైన గ్లోబల్ స్టార్ రామ్ చరణ్
  • భారతీయ సినిమాకు ప్రాతినిధ్యం
  • ఈ సదస్సులో పాల్గొనే అవకాశం లభించడం పట్ల చరణ్ హర్షం

ఇటీవల జమ్మూ కశ్మీర్ లోని శ్రీనగర్ లో నిర్వహించిన జీ20 సదస్సులో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ పాల్గొనడం తెలిసిందే. ఆ సదస్సులో  రామ్ చరణ్ యావత్ భారతీయ సినీ పరిశ్రమకు ప్రాతినిధ్యం వహించారు. ఈ సదస్సులో తన ఆలోచనలను ప్రభావంతమైన రీతిలో వివరించి అందరి మెప్పు పొందారు. జీ20 వంటి ప్రతిష్ఠాత్మక సదస్సులో పాల్గొనడంపై తాజాగా రామ్ చరణ్ సోషల్ మీడియాలో స్పందించారు. 

సుసంపన్నమైన రీతిలో వేళ్లూనుకున్న భారతీయ సంస్కృతి, ఆధ్యాత్మికతలను మన సినిమాల ద్వారా జీ20 వేదికపై చాటిచెప్పే అవకాశం లభించినందుకు ధన్యుడ్ని అయినట్టు భావిస్తున్నానని తెలిపారు. అందుకు నిజంగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నానని వివరించారు. 

ప్రతి ఒక్కరినీ కదిలించగల కంటెంట్ తో విలువైన జీవిత పాఠాలను అందించడంలో భారతీయ సినిమా ప్రత్యేక రమణీయతను కలిగి ఉందని రామ్ చరణ్ అభిప్రాయపడ్డారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, జమ్మూ కశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా, జీ20 మార్గదర్శకుడు అమితాబ్ కాంత్ లకు ధన్యవాదాలు తెలిపారు.

  • Loading...

More Telugu News