Nagarjuna: 'అన్నమయ్య'లో సుమన్ కంటే ముందు బాలయ్యను అనుకున్నారట!

Annamayya movie special

  • 1997లో వచ్చిన 'అన్నమయ్య'
  • ఆ పాత్రలో మెప్పించిన నాగార్జున 
  • ఆయన తొలి భక్తి చిత్రం ఇదే
  • వేంకటేశ్వరస్వామి పాత్రలో ఒదిగిపోయిన సుమన్ 

నాగార్జున హీరోగా రాఘవేంద్రరావు 'అన్నమయ్య' సినిమాను రూపొందించారు. దొరస్వామిరాజు నిర్మించిన ఈ సినిమా 1997లో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. విడుదలైన ప్రతి ప్రాంతంలో ఈ సినిమా విజయవిహారం చేసింది. అప్పటివరకూ నాగార్జున చేస్తూ వచ్చిన సినిమాలు వేరు. అందువలన ఈ భక్తి రసాత్మక చిత్రంలో ఆయన ఎలా మెప్పిస్తారా అనే ఒక సందేహం ఆడియన్స్ లో ఉండేది. అలాంటి సందేహాలకు నాగార్జున తెరదించేశారు. 

ఈ సినిమాలో వేంకటేశ్వరస్వామిగా సుమన్ నటించారు. అయితే ముందుగా ఈ పాత్ర కోసం బాలయ్యను అనుకున్నారట. ఎన్టీఆర్ తరువాత దేవుడి పాత్రలు చేయాలంటే బాలయ్యనే కరెక్ట్ అనే అభిప్రాయం జనంలో ఉంది. ఆయన విగ్రహం అందుకు కరెక్టుగా సరిపోతుందనే నిర్ధారణకు వచ్చారు. అయితే ఇక్కడే ఇంకొక చిక్కు వచ్చి పడింది. 

ఈ సినిమాలో అన్నమయ్య .. వేంకటేశ్వరస్వామి పాదాలపై పడవలసిన సన్నివేశం ఉంది. ఈ సీన్ ను నందమూరి అభిమానులు .. అక్కినేని ఫ్యాన్స్ ఎలా రిసీవ్ చేసుకుంటారో అనే ఒక అనుమానం వచ్చిందట. ఎందుకొచ్చిన గొడవ అని చెప్పేసి, సుమన్ ను సంప్రదించడం జరిగింది. ఆ పాత్రకి సుమన్ ఎంతగా న్యాయం చేశాడనే సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News