bandla ganesh: భార్యాభర్తల్ని కూడా వేరు చేస్తాడు.. అదే మన గురూజీ స్పెషల్: బండ్ల గణేశ్ ట్వీట్స్ వైరల్

bandla ganesh setairical comments on trivikram aka guruji
  • ‘బండ్లన్నా.. నాకు ప్రొడ్యూసర్ అవ్వాలని ఉంది’ అని ట్వీట్ చేసిన నెటిజన్
  • గురూజీకి ఖరీదైన బహుమతి ఇస్తే అయిపోతుందన్న బండ్ల గణేశ్
  • గురూజీ అనుకుంటే ఎవర్నైనా వేరు చేస్తాడంటూ ఫైర్
  • ఓ ప్రముఖ డైరెక్టర్ ను ఉద్దేశించే ఈ వ్యాఖ్యలు చేశారంటున్న నెటిజన్లు
కమెడియిన్ గా, నిర్మాతగా, వ్యాపారవేత్తగా, అప్పుడప్పుడు రాజకీయ నాయకుడిగా.. వీటన్నింటికీ మించి పవన్ కల్యాణ్ వీరాభిమానిగా బండ్ల గణేశ్ అందరికీ సుపరిచితుడు. ట్విట్టర్ లో తరచూ గుడ్ మార్నింగ్స్, సూక్తులను పోస్ట్ చేసే ఈయన.. అప్పుడప్పుడు సంచలన వ్యాఖ్యలతో హల్ చల్ చేస్తుంటారు. రాజకీయాల్లో వస్తానంటూ మొన్న ట్వీట్లు చేసిన బండ్ల.. తాజాగా ‘గురూజీ’ని టార్గెట్ చేస్తూ సెటైర్లు వేశారు.

ఈ రోజు ఉదయం బండ్ల గణేశ్ ను ట్యాగ్ చేస్తూ ఓ నెటిజన్ ట్వీట్ చేశాడు. ‘‘బండ్లన్నా నాకు ప్రొడ్యూసర్ అవ్వాలని ఉంది?’’ అని అడిగాడు. బదులిచ్చిన బండ్ల గణేశ్.. ‘‘గురూజీని కలవండి, ఖరీదైన బహుమతి ఇవ్వండి.. అంతే అయిపోతుంది’’ అని పేర్కొన్నారు. అయితే ప్రొడ్యూసర్ కావాలని ఉందని చేసిన ట్వీట్ ను సదరు యూజర్ తర్వాత తీసేశాడు.

‘‘గురూజీకి కథ చెబితే స్క్రీన్ ప్లే రాసి.. దానికి తగట్టు మళ్లీ కథను మార్చి.. అనుకున్న కథను షెడ్ కి పంపిస్తాడని టాక్ ఉంది’’ అని ఓ నెటిజన్ ట్వీట్ చేయగా.. ‘‘అదే కాదు..  భార్యాభర్తల్ని, తండ్రీ కొడుకుల్ని, గురుశిష్యుల్ని.. ఎవర్నైనా వేరు చేస్తాడు అనుకుంటే. అదే మన గురూజీ స్పెషాలిటీ’’ అని సెటైర్లు వేశారు. 

అయితే ఈ ట్వీట్ల వ్యవహారంలో గురూజీ ఎవరనేది మాత్రం బండ్ల గణేశ్ వెల్లడించలేదు. నిజానికి తెలుగు సినీ ఇండస్ట్రీలో ఓ ప్రముఖ డైరెక్టర్ ను కొందరు గురూజీ అంటూ పిలుస్తుంటారు. ఆయన్ను ఉద్దేశించే బండ్ల గణేశ్ వ్యంగ్యంగా ట్వీట్లు చేశారంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. పనిలో పనిగా ‘‘అప్పట్లో మీరు కూడా ఇలానే ఖరీదైన బహుమతులు ఇచ్చారా అన్న’’ అంటూ బండ్ల గణేశ్ కు కౌంటర్లు ఇవ్వడం కొసమెరుపు.
bandla ganesh
guruji
Trivikram Srinivas
Twitter

More Telugu News