Long Covid: మీలో ఈ లక్షణాలుంటే లాంగ్ కొవిడ్ వేధిస్తున్నట్టే!
- ఒమిక్రాన్ వేరియంట్ తర్వాత లాంగ్ కొవిడ్ లక్షణాలు
- ప్రతి పదిమందిలో ఒకరు ఇప్పటికీ బాధితులే
- చిన్నపాటి పనికే అలసిపోవడం, గుండెల్లో దడ, చాతీలో నొప్పి దాని లక్షణాలే
- అమెరికా శాస్త్రవేత్తల అధ్యయనం
ప్రపంచాన్ని భయం గుప్పిట్లోకి నెట్టిన కరోనా మహమ్మారి ఇంకా వేధిస్తూనే ఉంది. ఒమిక్రాన్ వేరియంట్ తర్వాత కరోనా బాధితుల్లో ప్రతి పదిమందిలో ఒకరు లాంగ్ కొవిడ్ లక్షణాలతో బాధపడుతున్నట్టు అమెరికా శాస్త్రవేత్తల పరిశోధనలో వెల్లడైంది. కరోనా నుంచి బయటపడిన ప్రతి పది మందిలో ఒకరు ఇప్పటికీ ఏదో ఒక సమస్యతో బాధపడుతున్నట్టు నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హెల్త్ అధ్యయనం పేర్కొంది.
చిన్నపాటి పనికే అలసిపోవడం, అయోమయం, గ్యాస్ట్రిక్ సమస్యలు, గుండె దడ, మెదడు సమస్యలు, శృంగారంపై అనాసక్తి, తరచూ దాహం వేయడం, రుచి, వాసన కోల్పోవడం, విపరీతమైన దగ్గు, చాతీలో నొప్పి వంటివి లాంగ్ కొవిడ్ లక్షణాలేనని అధ్యయనం వివరించింది.