TDP Mahanadu: టీడీపీ మహానాడులో నోరూరించే వంటకాలు... మెనూ ఇదే!

Mouth watering food in TDP Mahanadu

  • రాజమండ్రిలో ఈరోజు, రేపు మహానాడు వేడుక
  • అతిథులకు నోరూరించే ఆంధ్ర వంటకాలు సిద్ధం
  • రేపటి బహిరంగ సభకు 10 లక్షల మంది హాజరవుతారని అంచనా

తెలుగుదేశం పార్టీ పండుగ మహానాడు సందర్భంగా రాజమండ్రి నగరం పసుపుమయం అయింది. టీడీపీ నేతలు, కార్యకర్తలతో సందడిగా మారింది. కార్యక్రమానికి 15 వేల మంది ప్రతినిధులు హాజరవుతున్నారు. తొలి రోజున ప్రతినిధుల సభకు 30 నుంచి 40 వేల మంది కార్యకర్తలు హాజరవుతారని అంచనా వేస్తున్నారు. 50 వేల మందికి రుచికరమైన, నోరూరించే ఆంధ్ర వంటకాలను సిద్ధం చేస్తున్నారు. విజయవాడకు చెందిన అంబికా క్యాటరింగ్ అండ్ ఈవెంట్స్ కు చెందిన కిలారు వెంకట శివాజీకి వంట బాధ్యతలను అప్పగించారు. 1,500 మంది వంటవాళ్లు 200 వంటకాలను అతిథుల కోసం సిద్ధం చేశారు. ఆదివారం నాడు భారీ బహిరంగసభకు 10 లక్షల మంది హాజరవుతారని అంచనా వేస్తున్నారు. దీనికి తగ్గట్టుగానే ఏర్పాట్లు జరుగుతున్నాయి. 

ఈరోజు (శనివారం) మెనూ:
టిఫిన్ - ఇడ్లీ, మైసూర్ బజ్జీ, వడ, పునుగులు, పొంగల్, టమోటా బాత్, కొబ్బరి చట్నీ, అల్లం చట్నీ, సాంబార్. 

మధ్యాహ్నం, రాత్రి భోజనాలు - వెజ్ బిర్యానీ, బంగాళాదుంప కుర్మా, మిక్స్డ్ వెజిటబుల్ కర్రీ, బెండకాయ వేరుశనగ, గుత్తి వంకాయ, బెండకాయ ఫ్రై, టమోటా మునక్కాడ, మామిడి కాయ పప్పు, దొండకాయ ఫ్రై, మామిడి ఆవకాయ, దోస ఆవకాయ, సాంబారు, మజ్జిగ పులుసు, పెరుగు, కాకినాడ కాజా, తాపేశ్వరం గొట్టం కాజా, యాపిల్ హల్వా, జిలేబీ.  

రేపు (శనివారం) మెనూ:
టిఫిన్ -   ఇడ్లీ, మైసూర్ బజ్జీ, వడ, పునుగులు, పొంగల్, టమోటా బాత్, కొబ్బరి చట్నీ, అల్లం చట్నీ, సాంబార్. 

మధ్యాహ్నం, రాత్రి - శుక్రవారం నాటి వంటకాలే ఉంటాయి. అయితే స్వల్ప మార్పులు ఉంటాయి. సాంబార్ రైస్, చక్కర పొంగలి, పెరుగన్నం అదనంగా ఉంటాయి. 

భోజనాల వద్ద 10 లక్షల వాటర్ బాటిల్స్, 10 లక్షల వాటర్ ప్యాకెట్లు అందుబాటులో ఉంచారు.

  • Loading...

More Telugu News