Baba Ramdev: రెజ్లింగ్ సమాఖ్య అధ్యక్షుడిని జైల్లో వేయాలి: బాబా రామ్ దేవ్ 

Ramdev comes out in support of protesting wrestlers says Brij Bhushan must be put behind bars
  • ఇన్ని రోజులుగా నిరసన చేయాల్సి రావడం సిగ్గు చేటని వ్యాఖ్య
  • ఆడబిడ్డల గురించి తరచూ ఏదో మాట్లాడుతుంటాడని విమర్శ
  • తాను రాజకీయ కోణంలో మాట్లాడితే దుమారమేనన్న రామ్ దేవ్
లైంగిక వేధింపులకు వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న రెజ్లర్లకు యోగా గురువు, పతంజలి ఆయుర్వేద్ సంస్థ అధినేత బాబా రామ్ దేవ్ మద్దతు పలికారు. భారత రెజ్లర్ల సమాఖ్య అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ ను అరెస్ట్ చేసి జైల్లో వేయాలని డిమాండ్ చేశారు. శరణ్ సింగ్ లైంగిక వేధింపులకు వ్యతిరేకంగా మహిళా రెజ్లర్లు కొన్ని రోజులుగా నిరసన కార్యక్రమం నిర్వహిస్తుండడం తెలిసిందే. దీంతో ఈ అంశంపై మొదటిసారి బాబా రామ్ దేవ్ స్పందించారు.

రెజ్లింగ్ సమాఖ్య చీఫ్ వేధింపులకు వ్యతిరేకంగా, రెజ్లర్లు జంతర్ మంతర్ వద్ద నిరసన చేపట్టడం సిగ్గు చేటు. అలాంటి వ్యక్తులను తక్షణమే అరెస్ట్ చేసి జైల్లో పెట్టాలి. తల్లులు, అక్క చెల్లెళ్లు, కుమార్తెల గురించి ప్రతిరోజూ అర్థం పర్థం లేని మాటలు చెబుతుంటాడు’’ అని రామ్ దేవ్ అన్నారు. రాజస్థాన్ లోని భిల్వారాలో మూడు రోజుల యోగా కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. 

రెజ్లర్ల సమాఖ్య అధ్యక్షుడు శరణ్ సింగ్ కు వ్యతిరేకంగా ఎఫ్ఐఆర్ నమోదు అయినా ఇంత వరకూ అరెస్ట్ చేయకపోవడంపై మీడియా ప్రశ్నించింది. తాను కేవలం ప్రకటన మాత్రమే చేయగలనని బదులు ఇచ్చారు. రాజకీయంగా సమాధానం చెప్పగలనంటూ.. మేధోపరంగా తనకు వైకల్యం లేదన్నారు. ఈ దేశం కోసం తనకంటూ విజన్ ఉన్నట్టు చెప్పారు. రాజకీయ కోణం నుంచి ప్రకటన చేస్తే అది పెద్ద దుమారం లేపుతుందని, ఉరుములు మెరుపులు వస్తాయని వ్యాఖ్యానించారు.
Baba Ramdev
wrestlers
Brij Bhushan
reaction

More Telugu News