Amit Shah: హోం మంత్రి అమిత్ షాతో జగన్ భేటీ

AP CM jagan meets Amit shah

  • ఢిల్లీలో నీతి అయోగ్ సమావేశానికి హాజరైన సీఎం జగన్
  • ఆదివారం రాత్రి 10 గంటలకు అమిత్ షాతో భేటీ
  • పోలవరం ప్రాజెక్టు, విభజన చట్టంలోని అంశాలపై చర్చ
  • పోలవరం ప్రాజెక్టు సవరించిన అంచనాలకు త్వరగా ఆమోదం లభించేలా చూడాలని జగన్ అభ్యర్థన

నీతి అయోగ్ పాలకమండలి సమావేశంలో పాల్గొనేందుకు ఢిల్లీ వెళ్లిన ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి అక్కడ హోం మంత్రి అమిత్ షాతో సమావేశమయ్యారు. ఆదివారం రాత్రి సుమారు 10 గంటల సమయంలో ఈ సమావేశం జరిగింది. పార్లమెంటు భవన ప్రారంభోత్సవంలో హోం మంత్రిని జగన్ కలిసినా వ్యక్తిగతంగా భేటీ అయ్యే అవకాశం చిక్కలేదు. 

ఈ సమావేశంలో ఆంధప్రదేశ్‌కు సంబంధించి పలు కీలక అంశాలు చర్చకు వచ్చినట్టు సీఎం కార్యాలయం ఓ ప్రకటనలో తెలిపింది. పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి సవరించిన అంచనాలకు త్వరగా ఆమోదం తెలిపేలా చూడాలని సీఎం హోం మంత్రిని కోరినట్టు ముఖ్యమంత్రి కార్యాలయం పేర్కొంది. ఢిల్లీలోని ఏపీ భవన్ సహా, విభజన చట్టంలోని షెడ్యూల్ 9,10 ఆస్తుల విభజన అంశాలను కూడా సీఎం జగన్ అమిత్ షా వద్ద ప్రస్తావించారు.

  • Loading...

More Telugu News