DTH: డీటీహెచ్ కంపెనీలపై పన్నీరు జల్లిన ఐపీఎల్ 2023

Subscribers back on the DTH pitch all thanks to IPL

  • తాత్కాలికంగా ఆగిపోయిన కనెక్షన్ల క్షీణత
  • రెండు నెలల్లోనే కొత్తగా 3 లక్షల కనెక్షన్లు
  • అయినా భవిష్యత్తుపై ఇంకా అనిశ్చితే

కొత్త యూజర్లను ఆకర్షించడం కోసం నానా కష్టాలు పడుతున్న డీటీహెచ్ సంస్థలకు ఐపీఎల్ సీజన్ ఆపద్బాంధవుడిగా మారిపోయింది. మార్చి 31న ఈ సిరీస్ మొదలు కాగా, నేటి ఫైనల్ తో ముగియనుంది. ఈ కాలంలో కొత్త యూజర్లను ఆకర్షించడం పట్ల డీటీహెచ్ సంస్థలు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నాయి. ఏప్రిల్, మే నెలలో తమ డీటీహెచ్ విభాగం నికరంగా కొత్త యూజర్లను ఆకర్షించినట్టు ఎయిర్ టెల్ ఎండీ, సీఈవో గోపాల్ విట్టల్ ప్రకటించారు. బ్రాడ్ బ్యాండ్, అన్ని రకాల వీడియో కంటెంట్ యూజర్లను ఆకర్షించడానికి అనుకూలించినట్టు చెప్పారు.

ఐపీఎల్ సమయంలో డీటీహెచ్ పరిశ్రమ సుమారు 3 లక్షల కొత్త కనెక్షన్లను సంపాదించుకున్నట్టు పరిశ్రమ వర్గాలు వెల్లడించాయి. యూజర్ల సంఖ్య తగ్గడాన్ని నివారించుకున్నట్టు ఓ డీటీహెచ్ సంస్థ సీఈవో సైతం పేర్కొన్నారు. ఇదే పరిస్థితి ఇకముందూ కొనసాగుతుందా? అంటే వేచి చూడాల్సిందేనన్న సమాధానం వచ్చింది. ప్రస్తుతం డీటీహెచ్ పరిశ్రమ వ్యాప్తంగా 6.55 కోట్ల యాక్టివ్ కనెక్షన్లు ఉన్నాయి. యూజర్ల సంఖ్య తగ్గిపోకుండా ఉండేందుకు కొన్ని సంస్థలు తమ వ్యూహంలో మార్పులు చేశాయి. తమ డీటీహెచ్ కస్టమర్ల సంఖ్యలో క్షీణత నిలిచినట్టు జీ ఎంటర్ టైన్ మెంట్ ఎండీ, సీఈవో పునీత్ గోయంకా సైతం ప్రకటించారు. మొబైల్ లో ఓటీటీ ప్రపంచం తెరుచుకున్న తర్వాత అటు మల్టీప్లెక్స్ థియేటర్లు బోసిపోతుంటే, ఇటు డీటీహెచ్ కనెక్షన్లు కూడా తగ్గిపోతున్నాయి. 

  • Loading...

More Telugu News