Congress: రాజీవ్ గాంధీ విగ్రహాన్ని తొలగిస్తే కాల్చివేస్తానన్న మాజీ మంత్రి
- వనపర్తి రోడ్డు విస్తరణ నేపథ్యంలో తొలగింపులపై కాంగ్రెస్ ఆగ్రహం, ధర్నా
- సర్కిల్స్ వద్ద జాతీయ నాయకుల విగ్రహాలు తొలగించాలని చూడవద్దని సూచన
- పార్టీలతో మాట్లాడకుండా.. దొంగలమాదిరి అర్ధరాత్రి తొలగింపులు సరికాదన్న చిన్నారెడ్డి
వనపర్తిలో చేపట్టిన రోడ్డు విస్తరణలో దివంగత ప్రధాని రాజీవ్ గాంధీ విగ్రహాన్ని తొలగిస్తే తుపాకీతో కాల్చేస్తానని మాజీ మంత్రి చిన్నారెడ్డి ఆగ్రహోద్రుడయ్యారు. ఇక్కడ రోడ్డు విస్తరణ సందర్భంగా పాతబజార్ లోని దర్గా, ఓ ఆలయ స్వాగత తోరణాన్ని తొలగించినందుకు కాంగ్రెస్ ధర్నా చేపట్టింది. ఈ సందర్భంగా చిన్నారెడ్డి మాట్లాడారు. సర్కిల్స్ వద్ద జాతీయ నాయకుల విగ్రహాలను తొలగించాలని చూడటం ఎంత వరకు సమంజసమని ప్రశ్నించారు. అన్ని రాజకీయ పార్టీలతో మాట్లాడకుండా, దొంగల మాదిరి అర్ధరాత్రి దాటిన తర్వాత తొలగింపులు సరికాదన్నారు. నాలుగు రోడ్లు కలిసే విశాలమైన చౌరస్తాలో విగ్రహాలు ఉంటే తప్పేమిటన్నారు.