YS Jagan: జగన్ ఢిల్లీ వెళ్లినప్పుడల్లా అవినాశ్ రెడ్డి కేసుకు బ్రేకులు: గోరంట్ల
- అవినాశ్ రెడ్డిది అంతులేని కథ అని వ్యాఖ్య
- హత్యా రాజకీయాలను ప్రోత్సహిస్తున్నారని ఆగ్రహం
- జగన్ అరాచకాలకు సెలవు చెప్పాలని ప్రజలు చూస్తున్నారన్న టీడీపీ నేత
మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో కడప ఎంపీ అవినాశ్ రెడ్డిది అంతులేని కథ అని టీడీపీ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి విమర్శలు గుప్పించారు. సీఎం జగన్ ఢిల్లీ వెళ్లినప్పుడల్లా అవినాశ్ రెడ్డి కేసు అంశానికి బ్రేకులు పడుతున్నాయని ఆరోపించారు. హత్యా రాజకీయాలను ప్రోత్సహించడం ఏమిటని మండిపడ్డారు. జగన్ పాలన గురించి గోరంట్ల మాట్లాడుతూ... ఆయన అరాచకాలకు సెలవు చెప్పాలని రాష్ట్ర ప్రజలు ఎదురు చూస్తున్నారన్నారు.
టీడీపీ తొలి విడత మేనిఫెస్టోను ప్రజలు ఆదరిస్తారని, దసరాకు పూర్తిస్థాయి మేనిఫెస్టో వస్తుందని చెప్పారు. మహానాడు బ్యానర్లు కట్టుకుంటే మధ్యలో ఎంపీ భరత్ వచ్చి వైసీపీ ఫ్లెక్సీలు కడుతున్నారని ధ్వజమెత్తారు. పైగా మాపైనే కేసులు పెడుతున్నారన్నారు. రాజమహేంద్రవరంలో అధికారులతో కలిసి ఎంపీ ఆడుకుంటున్నారని ధ్వజమెత్తారు. పోలీసులు చుట్టూ లేకుండా వైసీపీ నేతలు ఎవరైనా బయటకు రాగలరా అని సవాల్ విసిరారు.