Nara Lokesh: టీడీపీ వస్తే చేనేతపై 5 శాతం జీఎస్టీ ఎత్తివేస్తాం: లోకేశ్

Lokesh met weavers in Jammalamadugu constituency

  • జమ్మలమడుగు నియోజకవర్గంలో లోకేశ్ యువగళం పాదయాత్ర
  • దేవగుడి క్యాంప్ సైట్ వద్ద చేనేత కార్మికులతో సమావేశం
  • ప్రభుత్వం నుంచి సహకారం అందడంలేదన్న కార్మికులు
  • అధికారంలోకి వస్తే రాష్ట్రవ్యాప్తంగా చేనేతను దత్తత తీసుకుంటామన్న లోకేశ్

వైఎస్సార్ కడప జిల్లా జమ్మలమడుగు నియోజకవర్గంలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ యువగళం పాదయాత్ర కొనసాగుతోంది. దేవగుడి క్యాంప్ సైట్ వద్ద చేనేత కార్మికులతో లోకేశ్ ముఖాముఖి సమావేశమయ్యారు. టెక్స్ టైల్ పార్కులో ఉపాధి అవకాశాలు కరవయ్యాయని, అన్ సీజన్ లో ప్రభుత్వం నుంచి సహకారం అందడంలేదని చేనేత కార్మికులు లోకేశ్ ఎదుట వాపోయారు. 

ఈ సందర్భంగా లోకేశ్ స్పందిస్తూ, రాష్ట్రవ్యాప్తంగా చేనేతను దత్తత తీసుకుంటామని ప్రకటించారు. టీడీపీ వచ్చాక చేనేతపై 5 శాతం జీఎస్టీ ఎత్తివేస్తామని హామీ ఇచ్చారు. నేత కార్మికులకు టిడ్కో ఇళ్లు, వర్కింగ్ షెడ్లు ఏర్పాటు చేస్తామని తెలిపారు. మగ్గం ఉన్న కార్మికులకు 200 యూనిట్ల విద్యుత్ ఇస్తామని లోకేశ్ వెల్లడించారు. చంద్రన్న బీమా పథకాన్ని మళ్లీ ప్రవేశపెడతామని చెప్పారు.

  • Loading...

More Telugu News