Chandrababu: చంద్రబాబు కరకట్ట నివాసం జఫ్తుపై ముగిసిన వాదనలు... జూన్ 2న తీర్పు!
- కరకట్టపై చంద్రబాబు నివాసం జఫ్తు చేసేందుకు అనుమతి కోరుతూ సీఐడీ పిటిషన్
- చంద్రబాబు క్విడ్ ప్రో కో మార్గంలో లింగమేని నుండి గెస్ట్ హౌస్ పొందినట్లు అభియోగం
- ఇరువైపుల వాదనలు విన్న న్యాయమూర్తి
టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు కరకట్ట నివాసం జఫ్తు పిటిషన్‌పై ఏసీబీ కోర్టులో వాదనలు ముగిశాయి. న్యాయమూర్తి బిందుమాధవి ఇరువైపుల వాదనలు విన్నారు. జూన్ 2న తీర్పును వెలువరించనున్నారు.
ఏం జరిగింది?
కరకట్టపై చంద్రబాబు ఇల్లు జఫ్తు చేసేందుకు అనుమతి కోరుతూ ఏసీబీ కోర్టులో సీఐడీ పిటిషన్ దాఖలు చేసింది. టీడీపీ హయాంలో సీఆర్డీఏ మాస్టర్ ప్లాన్, ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్ మెంట్‌లలో లింగమనేనికి లబ్ధి చేకూర్చారని, దానికి బదులుగా ఆయన ఇంటిని గెస్ట్ హౌస్ గా చంద్రబాబు పొందినట్లు సీఐడీ అభియోగాలు మోపింది. ఈ నేపథ్యంలో కరకట్టపై చంద్రబాబు నివాసం ఉంటున్న లింగమనేని ఇంటి జఫ్తుకు సీఐడీ అనుమతి కోరింది. దీనిపై వాదనలు విన్న న్యాయమూర్తి ఎల్లుండి తీర్పు వెలువరించనున్నారు.