Saas bahu fight: అత్తాకోడళ్ల మధ్య చిచ్చు పెడుతున్న కర్ణాటక ప్రభుత్వ పథకం!

Saas bahu fights erupt in Karnataka over govt Rs 2000 subvention plan

  • గృహ లక్ష్మి పేరుతో మహిళలకు నెలనెలా రూ.2 వేల పంపిణీ
  • మేనిఫెస్టోలో పేర్కొన్న హామీ అమలుకు సిద్ధమవుతున్న సర్కారు
  • ఈ మొత్తం తమకే చెందుతుందని పలు కుటుంబాల్లో అత్తాకోడళ్ల మధ్య కొట్లాట

కర్ణాటక ప్రభుత్వం తీసుకొస్తున్న ఓ సంక్షేమ పథకం ఆ రాష్ట్రంలోని అత్తాకోడళ్ల మధ్య చిచ్చు పెట్టింది. సదరు పథకానికి అర్హురాలిని నేనంటే నేను అంటూ అత్తాకోడళ్లు కొట్లాడుకుంటున్నారని తెలుస్తోంది. పథకం అమలులో అత్తాకోడళ్ల మధ్య ప్రభుత్వం ఎవరికి ప్రాధాన్యం ఇవ్వనుందని సర్వత్రా ఆసక్తి వ్యక్తమవుతోంది. కర్ణాటకలో వివాదం రేపిన ఆ పథకమే ‘గృహలక్ష్మి’.. ఎన్నికలకు ముందు విడుదల చేసిన మేనిఫెస్టోలో కాంగ్రెస్ పార్టీ ఈ పథకాన్ని ప్రకటించింది. ఈ పథకం కింద రాష్ట్రంలోని ప్రతీ కుటుంబంలో ఓ మహిళకు నెల నెలా రూ.2 వేలు అందజేయనున్నట్లు వెల్లడించింది.

అయితే, లబ్దిదారుల ఎంపిక విషయంలో పాటించే నియమనిబంధనలపై ప్రభుత్వం క్లారిటీ ఇవ్వకపోవడం వివాదానికి దారితీసింది. పలు కుటుంబాల్లో గొడవలకు కారణమవుతోంది. ప్రభుత్వం ఇచ్చే నగదు తనకే వస్తుందని అత్తాకోడళ్లు వాదులాడుకుంటున్నారట. దీంతో లబ్దిదారుల ఎంపికపై ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. ఈ నేపథ్యంలో పీడబ్ల్యూడీ మినిస్టర్ సతీశ్ జార్కిహోలి స్పందిస్తూ.. సంప్రదాయం ప్రకారం కుటుంబంలో మహిళా పెద్దగా అత్తగారు వ్యవహరిస్తారని చెబుతూ ప్రభుత్వం ఇచ్చే నగదు ఆమెకే చెందుతుందని చెప్పారు. కావాలంటే ఆమె తన కోడలుకు ఈ నగదు ఇచ్చుకోవచ్చని స్పష్టం చేశారు. త్వరలో జరగబోయే కేబినెట్ భేటీలో ఈ విషయంపై స్పష్టత వస్తుందని మంత్రి చెప్పారు.

  • Loading...

More Telugu News