Samudrakhani: అనుపమ పరమేశ్వరన్ చేతుల మీదుగా ‘విమానం’ ట్రైలర్ రిలీజ్!
- ఎమోషన్స్ ప్రధానంగా సాగే 'విమానం'
- తండ్రీకొడుకుల అనుబంధం ప్రధానంగా నడిచే కథ
- కీలకమైన పాత్రలో కనిపించనున్న అనసూయ
- జూన్ 9న తెలుగు .. తమిళ భాషల్లో విడుదల
బస్తీలో ఉండే తండ్రీ కొడుకులు.. పూట గడిస్తే చాలనుకునే సంపాదన.. అలాంటి ఓ పేద కుటుంబంలోని ఉండే పిల్లాడికి విమానం ఎక్కాలనే కోరిక పుడుతుంది. అవిటితనంతో తండ్రి బాధపడుతున్నప్పటికీ కొడుకు కోరికను తీర్చాలనుకుని రాత్రి .. పగలు కష్టపడుతుంటాడు. విమానం ఎక్కాలనుకునే కొడుకు కోరికను తీర్చటానికి ఏం చేయాలా అని ఎప్పుడూ ఆలోచిస్తుంటాడు. ఇది తండ్రీ కొడుకుల మధ్య ఉండే ఎమోషన్.
సుమతి అనే అమ్మాయిని ప్రేమించే కోటి అనే యువకుడు .. లోకమంతా తనను కామంతోనే చూస్తుందని భావించే ఆమెకు తనను మనస్ఫూర్తిగా ప్రేమించే వాడున్నాడని తెలియగానే ఆమె హృదయంలో నుంచి వచ్చే ఆవేదన.. ఇది రెండు హృదయాల మధ్య ఉండే ఎమోషన్. హృదయాన్ని తాకే ఇలాంటి భావోద్వేగాల వ్యక్తుల ప్రయాణాన్ని తెలియజేసే చిత్రమే ‘విమానం’.