boys reaction: భావోద్వేగాలు అమ్మాయిలకేనా..? అబ్బాయిలకు ఉండవా?
- చెన్నై విజయంతో కాలేజీ కుర్రాళ్ల సెలబ్రేషన్స్
- దీన్ని ట్విట్టర్ లో షేర్ చేసిన ఓ యువతి
- అబ్బాయిలు, అమ్మాయిలు ఒకరి గురించి ఒకరు ఎలా అనుకుంటారనే అంశం ప్రస్తావన
ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ లో చెన్నై సూపర్ కింగ్స్ విజయం సాధించింది. చివరి రెండు బంతులకు 10 పరుగులు చేస్తేనే చెన్నై విజయం సాధిస్తుంది. వేస్తున్నది గుజరాత్ తరఫున మోహిత్ శర్మ. మంచి ప్రతిభ కలిగిన బౌలర్. మొదటి నాలుగు బంతులకు కేవలం మూడు పరుగులే ఇచ్చిన మోహిత్ శర్మ బౌలింగ్ లో చివరి రెండు బంతుల్లో చెన్నై 10 పరుగులు చేసి గెలుపు ఖాయం చేస్తుందని ఊహించడానికే కష్టం. కానీ, అదే జరిగింది. ఐదో బంతిని సిక్సర్ కొట్టిన రవితేజ.. చివరి బంతిని ఫోర్ గా మలిచాడు.
ఆ క్షణంలో టీవీలు, కంప్యూటర్లు, ఫోన్లలో మ్యాచ్ ను వీక్షించే చెన్నై అభిమానులు ఎగిరి గంతేశారు. సంబరాలు చేసుకున్నారు. కాలేజీ హాస్టల్ లేదా ప్రైవేటు హాస్టల్ లో ఉన్న కుర్రాళ్లు కూడా ఈ చెన్నై విజయానందాన్ని కంట్రోల్ చేసుకోలేకపోయారు. ముఖ్యంగా ఎర్ర టీ షర్ట్ వేసుకున్న కుర్రాడు అయితే తలుపులను బాదుతూ, అటూ ఇటూ పరుగులు పెడుతూ.. కిటికీ ఊచలు పట్టుకుని వేలాడుతూ తన ఆనందాన్ని తెగ వ్యక్తం చేశాడు.
అంతా బాగానే ఉంది. కానీ, ఓ బాలిక ఈ కుర్రాళ్ల సెలబ్రేషన్స్ వెనుక ఒక కోణాన్ని వెలికితీసింది. అమ్మాయిలు, అబ్బాయిలు ఒకరి గురించి ఒకరు ఎలా అనుకుంటారన్నది తన ట్విట్టర్ పోస్ట్ ద్వారా వ్యక్తం చేసింది. ‘‘అమ్మాయిలు: అబ్బాయిలకు అస్సలు భావోద్వేగాలే ఉండవు. వీరు పూర్తిగా ఎమోషన్స్ లేని వారు. కానీ, ఇంతలో అబ్బాయిలు:..’’ అంటూ ఈ కుర్రాళ్ల సెలబ్రేషన్స్ వీడియోని పోస్ట్ చేసింది.