allu aravind: నా వల్ల చాలామంది కెరీర్‌లో పైకి వచ్చారు కానీ...: అల్లు అరవింద్ ఆసక్తికర వ్యాఖ్యలు

Allu Aravind interesting comments on directors
  • తన వల్ల పైకి వచ్చిన కొంతమంది ఆ తర్వాత గీతదాటారని వ్యాఖ్య
  • చందూ మొండేటి మాత్రం ఇచ్చిన మాటకే కట్టుబడ్డారన్న అల్లు
  • సినిమా పూర్తయ్యాకే ఇతర ప్రాజెక్టులు టేకప్ చేస్తానని ఫిక్స్ అయ్యాడన్న అల్లు అరవింద్
తన వల్ల చాలామంది కెరీర్ లో పైకి వచ్చారని, కానీ కొంతమంది ఆ తర్వాత ఈ విషయాన్ని మరిచిపోయారని ప్రముఖ సిని నిర్మాత అల్లు అరవింద్ అన్నారు. గీత దాటి వెళ్లి వారి పేర్లను తాను ఇప్పుడు చెప్పాలనుకోవడం లేదన్నారు. '2018' సినిమా ప్రెస్ మీట్ లో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ, కార్తికేయ 2 దర్శకుడు చందూ మొండేటిని ప్రశంసించారు. ఈ సందర్భంగా పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తన వల్ల పైకి వచ్చినవారు చాలామంది ఇప్పుడు గీత దాటారని, కానీ చందూ మొండేటి మాత్రం ఇచ్చిన మాటకే కట్టుబడ్డారన్నారు. తన సినిమా పూర్తయ్యాకే ఇతర ప్రాజెక్టులు టేకప్ చేస్తానని ఫిక్స్ అయ్యాడన్నారు.
allu aravind
Tollywood

More Telugu News