EV: ధరల పెరుగుదల వార్తల నేపథ్యంలో.. భారీగా పెరిగిన ఈవీ-టూ వీలర్ల అమ్మకాలు

Electric 2 wheeler sales jump as buyers see price hike ahead

  • ఒక్కో ఈ-బైక్ ధర రూ.15 వేల నుంచి 30 వేల వరకు పెంపు
  • ప్రభుత్వ సబ్సిడీల్లో మార్పులే కారణం
  • ఈ నెల 1నుంచే పెరిగిన రేట్లు అమల్లోకి

దేశంలో ఎలక్ట్రిక్ వాహనాలను డిమాండ్ పెరిగింది. కాలుష్యాన్ని తగ్గించేందుకు ఎలక్ట్రిక్ టూ, త్రీ, ఫోర్ వీలర్లను వాడకాన్ని ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది. పలు రాయితీలను కూడా అందించడంతో నెల నెలకు వాటి అమ్మకాలు పెరుగుతున్నాయి. మరోపక్క, జూన్ నుంచి వీటి ధరలు పెరగనున్నాయంటూ వచ్చిన వార్తల నేపథ్యంలో మే నెలలో వీటి అమ్మకాలు బాగా పెరిగాయి. ధరలు పెరగకముందే వాహనాలు కొనేసుకోవాలన్న ఉద్దేశం కస్టమర్లలో ఉండడంతో ముఖ్యంగా టూవీలర్ల సేల్స్ జోరందుకున్నాయి. 

ఈ నేపథ్యంలో, మే నెలలో వాటి అమ్మకాలు 57 శాతం పెరిగాయి. ఆ ఒక్క నెలలోనే లక్ష ఈ-టూవీలర్లు రిజిస్టర్ అయ్యాయి. జూన్ నెలలో ఎలక్ట్రిక్ టూ వీలర్ల ధరలు 15 నుంచి 20 శాతం పెరగనున్నాయి. ఏథర్, ఓలా ఎలక్ట్రిక్, ఆంపెర్, టీవీఎస్ మోటార్ సహా అన్ని ప్రముఖ ఎలక్ట్రిక్ వాహనాల ఒరిజినల్ ఎక్విప్‌మెంట్ తయారీదారులు ఈ నెల 1 నుంచే సగటున రూ. 15వేల నుంచి 30 వేల వరకు ధరలను పెంచాయి. 

ఇన్నాళ్లూ ఎలక్ట్రిక్‌ టూవీలర్స్‌ తయారీదారులకు ఇచ్చిన సబ్సిడీకి కేంద్ర ప్రభుత్వం కోత పెట్టడమే ధరల పెంపునకు కారణమైంది. కేంద్రం ఫాస్టర్‌ అడాప్షన్‌ అండ్‌ మాన్యుఫ్యాక్చరింగ్‌ ఆఫ్‌ ఎలక్ట్రిక్‌ అండ్‌ హైబ్రిడ్‌ వెహికిల్స్‌ (ఫేమ్‌) 2 పథకంలో ఇప్పుడు సవరణలు చేసింది. ఈ మార్పులు నిన్నటి నుంచే అమల్లోకి వచ్చాయి. దాంతో, కంపెనీలకు ఇప్పటిదాకా అందిన రాయితీలు భారీగా తగ్గిపోతుండగా ఆ భారాన్ని ఆయా సంస్థలు వినియోగదారులపైనే మోపనున్నాయి. వేరియంట్‌ను బట్టి టీవీఎస్‌ ఎలక్ట్రిక్‌ రూ.17-22 వేల మధ్యలో ధరలు పెంచింది. ఓలా కనీసం రూ. 15 వేలు పెంచింది.

  • Loading...

More Telugu News