indian cricketers: ప్రముఖ క్రికెటర్ల వారసులు.. వారి పేర్లు, వాటి అర్థాలు
- ధోనీ, సాక్షి దంపతులకు ఎనిమిదేళ్ల కుమార్తె జీవా
- కోహ్లీ, అనుష్క దంపతులకు కుమార్తె వామికా
- హార్థిక్ పాండ్యా దంపతులకు కుమారుడు అగస్త్య
తమ అభిమాన క్రికెటర్లను ఆరాధించే వారు మన దేశంలో లక్షలు, కోట్ల మంది ఉంటారు. పెద్ద సంఖ్యలోనే సామాజిక మాధ్యమాలలో ఫాలో అవుతుంటారు. కోట్లాది మంది అభిమానించే, ఆరాధించే క్రికెటర్లు.. తమ ప్రాణానికి ప్రాణమైన వారసులకు పెట్టిన పేర్లు, అందులోని అర్థాలు తెలుసుకుంటే ఆసక్తికరంగా అనిపిస్తుంది.
- మనదేశంలో ఎక్కువ మంది అభిమానించే క్రికెటర్లలో చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ ఒకరు. మహేంద్ర సింగ్ ధోనీ, సాక్షి ధోనీకి ఒక కుమార్తె ఉంది. ఆమె పేరు జీవా. వయసు ఎనిమిదేళ్లు. జీవా అంటే ప్రకాశం, మంచి వెలుగు అని అర్థం.
- మరో స్టార్ క్రికెటర్, టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ, బాలీవుడ్ నటి అనుష్క శర్మ ప్రేమించి పెళ్లాడగా, వీరికి ఒక్కగానొక్క కుమార్తె వామికా ఉంది. దుర్గాదేవికి ఉన్న పేర్లలో వామికా కూడా ఒకటి.
- ఇక క్రికెట్ దిగ్గజం సచిన్ టెండుల్కర్, అంజలి దంపతులకు అర్జున్ టెండుల్కర్, సారా సంతానం. వీరిలో సారా అంటే యువరాణి అని అర్థం.
- టీమిండియా కెప్టెన్, ముంబై ఇండియన్స్ జట్టు సారథి రోహిత్ శర్మ, ఆయన జీవిత భాగస్వామి రితికా సజ్దేకు నాలుగున్నరేళ్ల సమైరా ఉంది. మంత్ర ముగ్ధులను చేసే అనే అర్థం ఈ పేరులో ఉంది.
- శిఖర్ ధావన్, అయేషా ముఖర్జీకి జోరావర్ అనే ఏడేళ్ల కుమారుడు ఉన్నాడు. జోరావర్ అంటే బలమైన అని అర్థం.
- సురేష్ రైనా, ప్రియాంకా చౌదరి తమ కుమార్తెకు గ్రేసియా అని పేరు పెట్టుకున్నారు. దీనర్థం దీవెనలు.
- హర్బజన్ సింగ్, గీతా బస్రా కుమార్తె పేరు హినయా. అంటే వెలుగు, ప్రకాశవంతం, అంతమైన అనే అర్థాలు వస్తాయి.
- ఇక గుజరాత్ టైటాన్స్ సారథి హార్థిక్ పాండ్యా, నటాషా స్టాంకోవిక్ తమ కుమారుడికి అగస్త్య అని పేరు పెట్టుకున్నారు. అగస్త్య అంటే శివుడు అని అర్థం. అలాగే, ఈ పేరుతో మహర్షి కూడా ఉండేవారు.