Nara Lokesh: ఎవరూ అడగకపోయినా ఆస్తులు ప్రకటించిన కుటుంబం మాది: నారా లోకేశ్

Nara Lokesh talks about his family pride

  • ప్రొద్దుటూరు నియోజవకర్గంలో లోకేశ్ యువగళం
  • కొత్తపల్లిలో వివిధ రంగాల ప్రముఖులతో సమావేశం
  • కడప జిల్లాలో వైసీపీకి 10కి 10 సీట్లు ఇచ్చారని వెల్లడి
  • దొంగ చేతికి తాళాలు ఇచ్చినట్టయిందని లోకేశ్ విమర్శలు

జగన్ ది ఫ్యాక్షన్ మనస్తత్వం... జగన్ పాలనలో అన్ని రంగాల వారు బాధితులే, సొంత జిల్లా కడప, సొంత నియోజకవర్గం పులివెందులకి ఏం చేశాడో జగన్ చెప్పగలడా? అని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ సవాల్ విసిరారు. యువగళం పాదయాత్రలో భాగంగా ప్రొద్దుటూరు నియోజకవర్గం కొత్తపల్లిలో వివిధరంగాల ప్రముఖులతో లోకేశ్ ముఖాముఖి సమావేశమయ్యారు. 

సమావేశంలో లోకేశ్ మాట్లాడుతూ... ఉమ్మడి కడప జిల్లాలో పదికి పది సీట్లు ఇస్తే జగన్ చేసింది ఏంటి? దొంగ చేతికి తాళం ఇస్తే ఏం జరిగింది? అందరూ దోపిడీకి గురయ్యారని విమర్శించారు. లాయర్లు, డాక్టర్లు, వ్యాపారస్తులు, టీచర్లు, ఐటీ నిపుణులు అందరూ జగన్ చేతిలో బాధితులేనని అన్నారు. 

కప్పంకట్టలేక వ్యాపారుల ఇక్కట్లు

వ్యాపారస్తులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. ప్రొద్దుటూరులో వ్యాపారస్తులు కప్పం కట్టలేక ఇబ్బంది పడుతున్నారు. మరో పక్క చెత్త పన్ను, బోర్డు పన్ను, కరెంట్ బిల్లులు పేరుతో భారీగా జే ట్యాక్స్ కడుతున్నారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే జగన్ పెంచిన అడ్డగోలు పన్నులు తగ్గిస్తాం. 

గతంలో ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ తీసుకొచ్చాం. ఇప్పుడు కాస్ట్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ తీసుకొచ్చి వ్యాపారాలు తక్కువ ఖర్చుతో నిర్వహించే విధంగా ప్రోత్సహిస్తాం. వెయ్యి, రెండు వేల నోట్లు రద్దు చెయ్యాలని చెప్పిన ఏకైక నాయకుడు చంద్రబాబు గారు. దొంగబ్బాయ్ ఉన్నంత వరకూ దొంగ నోట్లు ఉంటాయి. బాబు గారు వచ్చిన వెంటనే అక్రమార్కులు ఆటోమేటిక్ గా కంట్రోల్ అవుతారు.

జగన్ వేధింపులతో కంపెనీలు పరార్

బాబు అంటే బ్రాండ్... జగన్ అంటే జైలు. టీడీపీ హయాంలో 6 లక్షల ఉద్యోగాలు కల్పించాం అని వైసీపీ ప్రభుత్వమే ఒప్పుకుంది. ఇప్పుడు కోడి గుడ్డు మంత్రి రాష్ట్ర పరువు తీస్తున్నాడు. జగన్ వేధింపుల వలన అన్ని కంపెనీలు ఇతర రాష్ట్రాలకు పారిపోతున్నాయి. 

టీడీపీ హయాంలో అభివృద్ది వికేంద్రీకరణ చేసి చూపించాం. రాయలసీమను ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్స్ హబ్ గా మార్చాం, విశాఖకు ఐటీ కంపెనీలు తీసుకొచ్చాం. జగన్ వేధింపులు, జే ట్యాక్స్ కట్టలేక కంపెనీలు అన్ని ఇతర రాష్ట్రాలకు వెళ్లిపోతున్నాయి. అమర్ రాజా, ఫాక్స్ కాన్, రిలయన్స్ లాంటి సంస్థలు వేరే రాష్ట్రాలకు వెళ్లి పోయాయి.

జగన్ విధానాలు విద్యార్థుల పాలిట శాపం

జగన్ వచ్చిన తరువాత విద్యా వ్యవస్థను నాశనం చేశాడు. టీచర్లను మద్యం దుకాణాల ముందు నిలబెట్టి సెక్యూరిటీ గార్డుల్లా ట్రీట్ చేశారు. ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని భ్రష్టు పట్టించాడు. విద్యా దీవెన, వసతి దీవెన అనే చెత్త కార్యక్రమాలు తీసుకొచ్చాడు. డబ్బులు పడక, సర్టిఫికేట్లు రాక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. జగన్ కొత్త విధానాలు తల్లిదండ్రులు, విద్యార్థుల పాలిట శాపంగా మారాయి. 

టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే పాత ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని అమలు చేస్తాం. టీచర్లపై ఎటువంటి వేధింపులు ఉండవు, యాప్ ల పేరుతో పెట్టిన భారం లేకుండా చేస్తాం. టీడీపీ అధికారంలోకి వచ్చిన తరువాత టీచర్లు కేవలం పాఠాలు చెప్పే పని తప్ప ఇతర పనులతో వేధింపులు ఉండవు.

న్యాయవిభాగానికి మేం నిధులిస్తే ఆపేశారు!

టీడీపీ హయాంలో న్యాయ విభాగానికి నిధులు కేటాయించి కొత్త భవనాలు, లైబ్రరీలు కట్టించడానికి పనులు ప్రారంభించాం. ఈ ప్రభుత్వం ఆ పనులు నిలిపివేసింది. నేను సాక్షి పై పరువు నష్టం దావా కేసు వేశాను. అందులో భాగంగా వైజాగ్ కోర్టుకు వెళ్ళినప్పుడు కోర్టుల్లో ఎంత దారుణమైన పరిస్థితి ఉందో అర్థమైంది. ఆ రోజే నిర్ణయించుకున్నా... న్యాయ వ్యవస్థకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని. 

టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే అడ్వకేట్ల రక్షణ కోసం ప్రత్యేక చట్టం తెస్తాం. మౌలిక వసతుల కల్పన కోసం ప్రత్యేకంగా నిధులు కేటాయిస్తాం. కొత్త భవనాలు, జూనియర్ లాయర్ల కోసం కోర్టులోనే లైబ్రరీ, ఇతర మౌలిక వసతులు కల్పిస్తాం. 

అడ్వకేట్లకు ప్రత్యేక ఇన్స్యూరెన్స్ స్కీం తీసుకురావడం పై చర్చించి నిర్ణయం తీసుకుంటాం. అడ్వకేట్లకు నాణ్యమైన ఇళ్లు కట్టించి ఇస్తాం. ప్రత్యేక సంక్షేమ నిధి ఏర్పాటు చేస్తాం.

ఫైబర్ గ్రిడ్ ను చంపేశారు!

టీడీపీ హయాంలో తీసుకొచ్చిన ఫైబర్ గ్రిడ్ ని జగన్ చంపేశాడు. తక్కువ ధరకే హై స్పీడ్ ఇంటర్నెట్ అందిస్తే ప్రజలకు మేలు, వర్క్ ఫ్రం హోమ్ చేసుకోవచ్చు అని చంద్రబాబు గారు ఫైబర్ గ్రిడ్ డిజైన్ చేశారు. ఫైబర్ గ్రిడ్ పథకాన్ని చంపడానికి నాపై అనేక ఆరోపణలు చేశారు. ఫైబర్ గ్రిడ్ దగ్గర నుండి స్కిల్ డెవలప్ మెంట్ వరకూ అనేక ఆరోపణలు చేశారు. ఒక్కటి కూడా నిరూపించలేకపోయారు. 

ఎవరూ అడగకపోయినా ఆస్తులు ప్రకటించిన కుటుంబం మాది. మాకు జగన్ లా దోచుకొని జైలుకి వెళ్ళాలి అనే ఆశ లేదు. టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే చౌకగా హై స్పీడ్ ఇంటర్నెట్ అందిస్తాం.

పర్యాటకరంగాన్ని అభివృద్ధి చేస్తాం

పర్యాటక రంగంలో ఏపీకి అనేక అద్భుత అవకాశాలు ఉన్నాయి. ఎకో టూరిజం ఏర్పాటు ద్వారా ఎంతో మందికి ఉపాధి అవకాశాలు కల్పించే అవకాశం ఉంది. టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఎక్కువ మందికి ఉపాధి అవకాశాలు కల్పించే విధంగా తీర ప్రాంతాన్ని, ఏకో టూరిజం, టైగర్ ఎకో టూరిజం అభివృద్ది చేస్తాం. ధనవంతులకు, పేదలకు మధ్య వ్యత్యాసం బాగా పెరిగిపోయింది. టీడీపీ ప్రభుత్వం వచ్చిన వెంటనే మేనిఫెస్టోలో ఇచ్చిన ప్రతి హామీ నెరవేర్చి ఆ వ్యత్యాసాన్ని తగ్గిస్తాం.

*యువగళం వివరాలు:*

*ఇప్పటి వరకు నడిచిన మొత్తం దూరం 1470.4 కి.మీ.*

*ఈరోజు నడిచిన దూరం 13.8 కి.మీ.*

*115 వరోజు పాదయాత్ర వివరాలు (2-6-2023)*

*మైదుకూరు అసెంబ్లీ నియోజకవర్గం (కడప జిల్లా):*

సాయంత్రం

4.00 – విశ్వనాథపురం క్యాంప్ సైట్ నుంచి పాదయాత్ర ప్రారంభం.

4.10 – మొర్రపల్లి క్రాస్ వద్ద స్థానికులతో సమావేశం.

4.50 – మైదుకూరు మున్సిపల్ ఆఫీసు వద్ద స్థానికులతో సమావేశం.

5.00 – మైదుకూరు రాయలకూడలిలో బహిరంగసభ, యువనేత ప్రసంగం.

6.15 – మైదుకూరు ఆర్టీసి బస్టాండు వద్ద స్థానికులతో మాటామంతీ.

6.20 – మైదుకూరు శ్రీనివాసనగర్లో స్థానికులతో సమావేశం.

6.25 – మైదుకూరు బాబా గుడి వద్ద రైతులతో సమావేశం.

7.10 – భూమయ్యపల్లి గుంటూరు కొట్టాల వద్ద స్థానికులతో మాటామంతీ.

7.50 – భూమయ్యపల్లిలో రైతులతో సమావేశం.

8.10 – భూమయ్యపల్లి విడిది కేంద్రంలో బస.

******

  • Loading...

More Telugu News