Odisha Train Accident: ఒడిశా రైలు ప్రమాదం.. సికింద్రాబాద్‌లో ప్రయాణికుల తిప్పలు

Odisha Trian Tragedy Affects On Secunderabad Railway Station

  • ఒడిశా మీదుగా ప్రయాణించే పలు రైళ్ల రద్దు
  • రద్దైన రైళ్ల సమాచారం ఇవ్వడంలో అధికారుల విఫలం
  • ప్లాట్‌ఫాంల చుట్టూ తిరిగిన ప్రయాణికులు
  • ఈస్ట్‌కోస్ట్, షాలిమార్, ఫలక్‌నుమా రైళ్ల రద్దు

ఒడిశాలోని బాలాసోర్‌లో జరిగిన ఘోర రైలు ప్రమాదం ప్రభావం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌పైనా పడింది. ప్రమాదం నేపథ్యంలో ఒడిశా మీదుగా ప్రయాణించే పలు రైళ్లను రద్దు చేస్తున్నట్టు అధికారులు ప్రకటించారు. అయితే, ఈ విషయంలో ప్రయాణికులకు సరైన సమాచారం ఇవ్వడంలో విఫలం కావడంతో గందరగోళం ఏర్పడింది. ఏ రైలును రద్దు చేశారో, ఏది ఎప్పుడు బయలుదేరుతుందో తెలియక ప్రయాణికులు తీవ్ర గందరోగళానికి గురయ్యారు. ప్లాట్‌ఫాంల చుట్టూ తిరుగుతూ కనిపించారు. ఫలితంగా విపరీతమైన రద్దీ నెలకొంది. 

ఎంక్వైరీలో సంప్రదించిన వారికి కూడా నిరాశే మిగిలింది. ఎంక్వైరీ అధికారులు సరైన సమాధానం చెప్పడంలో విఫలమయ్యారు. తమకు కూడా ఇంకా సమాచారం అందలేదంటూ సాయంత్రం వరకు కాలయాపన చేసి ప్రయాణికుల సహనానికి పరీక్ష పెట్టారు. నిన్న ఉదయం, సాయంత్రం బయలుదేరాల్సిన ఈస్ట్‌కోస్ట్, షాలిమార్, ఫలక్‌నుమా రైళ్లను రద్దు చేశారు. గౌహతి ఎక్క్‌ప్రెస్ రెండు గంటలు ఆలస్యంగా నడవగా, సికింద్రాబాద్ రావాల్సిన మూడు రైళ్లను రద్దు చేశారు.

  • Loading...

More Telugu News