Odisha train accident: ఒడిశా రైలు ఘోర ప్రమాదానికి మూల కారణం ఇదే: రైల్వే మంత్రి వైష్ణవ్

 Rail minister Vaishnaw says root cause identified for Odisha train accident

  • ఎలక్ట్రిక్ ఇంటర్ లాకింగ్‌లో మార్పే కారణమని గుర్తించామని వెల్లడి
  • ప్రమాదంపై దర్యాప్తు పూర్తయ్యిందన్న కేంద్ర మంత్రి
  • ప్రభుత్వానికి నివేదిక అందిన తర్వాత పూర్తి వివరాలు 
    ప్రకటిస్తామన్న అశ్విన్

ఒడిశాలోని బాలాసోర్‌లో మూడు రైళ్లు ఢీకొని జరిగిన ఘోర ప్రమాదానికి గల మూలకారణాన్ని గుర్తించినట్లు కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ ఆదివారం తెలిపారు. ప్రమాద స్థలంలో ఉన్న మంత్రి  ఓ వార్తా సంస్థతో మాట్లాడుతూ, రైలు ప్రమాదంపై దర్యాప్తు పూర్తయిందని, రైల్వే భద్రతా కమిషనర్ త్వరలో నివేదికను సమర్పిస్తారని చెప్పారు. ఎలక్ట్రిక్ ఇంటర్‌ లాకింగ్‌లో మార్పు కారణంగానే ఈ ప్రమాదం జరిగిందని, ఈ ప్రమాదంపై దర్యాప్తు పూర్తయ్యిందని చెప్పారు. ప్రభుత్వానికి నివేదిక అందిన వెంటనే బయటకు పూర్తి వివరాలు వెల్లడిస్తామని చెప్పారు. 

మూడు రైళ్లు ఢీకొన్న ప్రాంతాన్ని ఆదివారం ఉదయం సందర్శించారు. ప్రమాదస్థలంలో యుద్ధప్రాతిపదికన పునరుద్ధరణ పనులు జరుగుతున్నాయని, 1000 మందికిపైగా ఒడిశా కార్మికులు శ్రమిస్తున్నారని ఆయన తెలిపారు.  రైల్వే ట్రాకుల పునరుద్ధరణను ఈ రోజే పూర్తి చేసేందుకు ప్రయత్నిస్తామన్నారు. బుధవారం ఉదయం నాటికల్లా పనులన్నీ పూర్తి చేసి, ఆ రూట్లో సర్వీసులు పునరుద్ధరణ అవుతాయని పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News