Poha: అటుకుల ఉప్మా.. ఆరోగ్యానికి సూపర్ రెసిపీ

Poha can be consumed for health issues

  • తేలిగ్గా అరుగుతుంది
  • తక్షణ శక్తినిచ్చే పదార్థం
  • ఐరన్, విటమిన్ బీ లభిస్తాయి
  • అందరూ తినదగిన ఆహారం

అటుకలతో చేసిన ఉప్మా (పోహ) రుచిలోనే కాదు, పోషకాల్లోనూ మేటి అని చెబుతున్నారు ఫోర్టిస్ హాస్పిటల్ చీఫ్ డైటీషియన్ రుచికా జైన్. బ్రేక్ ఫాస్ట్ కింద అటుకుల ఉప్మాను తీసుకుంటూ ఉంటారు. దీనివల్ల ఆరోగ్యానికి ఎలాంటి ప్రయోజనాలు ఉన్నాయో జైన్ వివరించారు. 

అటుకుల ఉప్మాని తినడం వల్ల తక్షణ శక్తి లభిస్తుంది. విటమిన్ బీ లోపం కూడా భర్తీ అవుతుంది. ఇందులో లాక్టోజ్ ఉండదు. గ్లూటెన్ కూడా ఉండదు. ఫ్యాట్ కూడా పెద్దగా ఉండదు. పొట్టపై భారం పడదు. తేలిగ్గా అరుగుతుంది. టైఫాయిడ్, హెపటైటిస్, ఇరిటబుల్ బవెల్ సిండ్రోమ్ సమస్యలతో బాధపడుతున్న వారికి సైతం పోహాను సూచిస్తామని జైన్ వెల్లడించారు. 

ఇందులో 4.6 శాతం ఐరన్ ఉంటుంది. అటుకులను తయారు చేసే క్రమంలో మెషిన్ల నుంచి వెళ్లడం వల్ల ఐరన్ తోడవుతుంది. కనుక ఐరన్ లోపం ఉన్న వారికి అనుకూలమైన రెసిపీ. సాధారణంగా మన శరీరం ఐరన్ ను తగినంత గ్రహించాలంటే విటమిన్ సీని కూడా ఉండాలి. కనుక అటుకుల ఉప్మాలో నిమ్మరసం కలుపుకోవాలి. దీంతో అటుకుల్లో ఉన్న ఐరన్ మన శరీరానికి పూర్తిగా అందుతుంది. 

అటుకుల్లో 70 శాతం కార్బోహైడ్రేట్లు ఉంటాయి కనుక తక్షణమే శక్తి లభిస్తుంది. అటుకుల్లో ప్రోబయాటిక్ కూడా ఉంటుంది. ఇక అటుకుల ఉప్మాలో వేసే పల్లీలు, కరివేపాకు, ఉల్లిగడ్డ అన్నీ కూడా ఆరోగ్యానికి మంచి చేసేవే.

  • Loading...

More Telugu News