Odisha: ఈ అభాగ్యులంతా ఎవరో? ఇప్పటికీ గుర్తించలేని 101 మంది మృతదేహాలు!

101 dead bodies of train accident still not identified

  • ట్రిపుల్ ట్రైన్ యాక్సిడెంట్ లో 278 మంది మృతి
  • 1,100 మందికి పైగా క్షతగాత్రులు
  • ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్ అయిన దాదాపు 900 మంది

ఒడిశాలో చోటు చేసుకున్న ఘోరమైన ట్రిపుల్ ట్రైన్ యాక్సిడెంట్ లో 278 మంది మృతి చెందారు. వెయ్యికి పైగా ప్రయాణికులు గాయాలపాలయ్యారు. మృత దేహాలు ఇంకా ఉండే అవకాశం ఉందనే వార్తలు కూడా వస్తున్నాయి. మరో దారుణమైన విషయం ఏమిటంటే ఇప్పటికీ 101 మంది మృత దేహాలు ఎవరివి అనేది గుర్తించలేకపోయారు. వీరిని ఇంకా గుర్తించాల్సి ఉందని ఈస్టర్న్ సెంట్రల్ రైల్వేస్ డివిజనల్ మేనేజర్ రింకేశ్ రాయ్ తెలిపారు. 

మొత్తం 1,100 మంది గాయపడగా వీరిలో దాదాపు 900 మంది చికిత్స తీసుకుని, ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారని రింకేశ్ వెల్లడించారు. దాదాపు 200 మంది వివిధ ఆసుపత్రుల్లో ఇంకా చికిత్స పొందుతున్నారని చెప్పారు. ఐడెంటిఫై చేస్తున్న మృత దేహాలను వారి బంధువులకు అప్పగిస్తున్నట్టు తెలిపారు.

  • Loading...

More Telugu News