MS Dhoni: ధోనీ కోరుకుంటే ఇప్పటికీ టీమిండియాకు ఆడొచ్చు: వసీం అక్రమ్

MS Dhoni couldve still played for India if he Wasim Akrams brave claim on CSK captain

  • ధోనీ ఓ కెప్టెన్, క్రికెట్ జెమ్ అని పేర్కొన్న వసీం అక్రమ్
  • ఏ జట్టును ఇచ్చినా టైటిల్ నెగ్గుకొస్తాడని వ్యాఖ్య 
  • సరైన సమయంలో రిటైర్మెంట్ ప్రకటించాడని ప్రశంస

అంతర్జాతీయ క్రికెట్ కు మహేంద్ర సింగ్ ధోనీ వీడ్కోలు చెప్పి మూడేళ్లు అయింది. అయినా కానీ, ఐపీఎల్ లో ఇప్పటికీ ధోనీ ఉత్సాహంగా, చురుగ్గా తన సత్తా చాటుతూనే ఉన్నాడు. ఈ సీజన్ తో ఐపీఎల్ కు సైతం గుడ్ బై చెబుతాడని ఎంతో మంది అంచనా వేయగా, మరో సీజన్ ఆడతానని ధోనీ స్పష్టత ఇచ్చాడు. ఐపీఎల్ లో వికెట్ల వెనుక ధోనీ ఇప్పటికీ చురుగ్గానే పనిచేస్తున్నాడు. 7 లేదా 8వ నంబర్ బ్యాటర్ గా రంగంలోకి దిగుతూ, సాధ్యమైనన్ని సిక్సర్లు, బౌండరీలు కొట్టే విధంగా అతడి ఇన్సింగ్స్ కొనసాగుతోంది. ఈ క్రమంలో పాకిస్థాన్ మాజీ కెప్టెన్ వసీం అక్రమ్ ధోనీపై స్పందించాడు.

ధోనీ కోరుకుంటే ఇప్పటికీ టీమిండియా కోసం ఆడొచ్చని అక్రమ్ అభిప్రాయపడ్డాడు. అయితే అంతర్జాతీయ క్రికెట్ నుంచి తప్పుకోవాలని అతడు 2020 ఆగస్ట్ లో సరైన నిర్ణయమే తీసుకున్నాడన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. నిజానికి 2019 వన్డే ప్రపంచ కప్ తర్వాత టీమిండియా తరఫున ధోనీ ఆడింది లేదు. అప్పటి నుంచి ఏడాది అనంతరం ధోనీ తన రిటైర్మెంట్ ప్రకటించేశాడు. ‘‘ధోనీ ఆటతీరు ఆధారంగా చూస్తే అతడు కోరుకుంటే ఇప్పటికీ టీమిండియాకు ఆడొచ్చు. కానీ, అతడు సరైన సమయంలో రిటైర్మెంట్ ప్రకటించేశాడు. అందుకే ధోనీ అంటే ధోనీయే. వచ్చే ఏడాది ఐపీఎల్ సీజన్ కోసం మరింత బలంగా తిరిగొస్తాడు’’ అని అక్రమ్ పేర్కొన్నాడు. 

ధోనీ ఫిజికల్ గా ఫిట్ గా ఉన్నట్టు అక్రమ్ పేర్కొన్నాడు. ‘‘అతడికి ఎంతో అనుభవం ఉంది. ప్రశాంతంగా ఉంటాడు. మరీ ముఖ్యంగా ఆడాలన్న కోరిక ఉంది. ఆడాలన్న ఆకాంక్ష లేనప్పుడు ఎంత ఫిట్ గా ఉన్నా వ్యర్థమే. అలాంటప్పుడు పనితీరు చూపించలేరు. ధోనీలో ఇంకా ఆట పట్ల ప్యాషన్ ఉంది’’ అని అక్రమ్ వివరించాడు. క్రికెట్ జెమ్ గా, కెప్టెన్ జెమ్ గా ధోనీని అభివర్ణించాడు. ‘‘ఓకే జట్టు తరఫున ఐదు ఐపీఎల్ టైటిల్స్ గెలవడం అంటే అంత ఆషామాషీ కాదు. ఇది పెద్ద టోర్నమెంట్. పది జట్లు ఉన్నాయి. ఒక్కో జట్టు 14 మ్యాచులు ఆడితేనే ప్లే ఆఫ్ కు వెళ్లగలవు. వారు నిదానంగా మొదలు పెట్టారు. కానీ, ధోనీకి ఏ జట్టును ఇచ్చినా దాన్ని ఫైనల్ కు తీసుకెళ్లి విజయం సాధిస్తాడు’’ అని ధోనీ నైపుణ్యాలను వివరించాడు.

  • Loading...

More Telugu News