Canada: కెనడాలో 700 మంది భారత విద్యార్థుల ఆందోళన

Indian students in canada protest over deportation notices

  • డిపోర్టేషన్ లెటర్లు అందుకోవడంతో రోడ్డెక్కిన స్టూడెంట్స్
  • రాత్రిపూట చలిలోనూ ఆందోళన కొనసాగింపు
  • ఎక్కువ మంది విద్యార్థులు పంజాబ్ కు చెందినవారే

కెనడాలో ఉన్నత చదువుల కోసం వెళ్లిన భారతీయ విద్యార్థుల్లో సుమారు 700 మంది భవితవ్యం ప్రశ్నార్థకంగా మారింది. ఫేక్ అడ్మిషన్ లెటర్లతో దేశంలోకి అడుగుపెట్టారని ఆరోపిస్తూ వారందరిని ఇండియా పంపించేందుకు కెనడా ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. ఇందులో భాగంగా ఇమ్మిగ్రేషన్ అధికారులు ఈ విద్యార్థులకు నోటీసులు జారీ చేశారు. చదువు పూర్తిచేసి ఉద్యోగాలు చేసుకుంటున్న వారికీ నోటీసులు అందాయి. దీంతో విద్యార్థులంతా ఆందోళనకు దిగారు. కెనడాలోని వివిధ వర్సిటీల్లో చదువుతున్న ఇండియన్ స్టూడెంట్లు, వివిధ ఉద్యోగాలు చేస్తున్న వారు రోడ్డెక్కారు. నోటీసులు అందుకున్న వారిలో ఎక్కువమంది పంజాబ్ కు చెందిన వారేనని సమాచారం.

మిస్సుసాగా సిటీలోని కెనడా బార్డర్ సర్వీస్ ఏజెన్సీ (సీబీఎస్ఏ) ప్రధాన కార్యాలయం ముందు భారతీయ విద్యార్థులు ఆందోళన చేస్తున్నారు. లంగర్ తరహాలో రోడ్డుపైనే వంటలు చేసుకుని తింటూ, రాత్రుళ్లు కూడా అక్కడే నిద్రిస్తున్నారు. చదువులో టాపర్లుగా ఉన్న తమకు ఫేక్ అడ్మిషన్ లెటర్లతో కెనడా రావాల్సిన అవసరం ఏముందని వారు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. తమలో కొంతమంది ట్రావెల్ ఏజెంట్ల చేతిలో మోసపోయామని చెప్పారు. బాధిత విద్యార్థులపైన చర్యలు తీసుకోవడమేంటని వారు నిలదీస్తున్నారు. సాయం చేయాలంటూ ఇమ్మిగ్రేషన్ వ్యవహారాల మంత్రి సియాన్ ఫ్రాజర్ ను అభ్యర్థించగా.. న్యాయం చేస్తామంటూ ఆయన హామీ ఇచ్చారని విద్యార్థులు చెబుతున్నారు. కాగా, కెనడాలోని కొంతమంది రాజకీయ నాయకులు ఈ ఆందోళనలకు మద్దతుగా నిలుస్తున్నారు.

  • Loading...

More Telugu News