Andhra Pradesh: కాంట్రాక్ట్ ఉద్యోగాలు మొదలు 12వ పీఆర్సీ వరకు... ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు
- ప్రభుత్వ పెన్షన్ విధానంపై బిల్లును రూపొందించేందుకు కేబినెట్ ఆమోదం
- ఏపీ గ్యారెంటీడ్ పెన్షన్ బిల్లు 2023 పేర కొత్త పెన్షన్ విధానం అమలుకు ఓకే
- ప్రభుత్వ ఉద్యోగులకు జీపీఎస్ అమలుకు కేబినెట్ ఆమోద ముద్ర
ఆంధ్రప్రదేశ్ కేబినెట్ సమావేశంలో ఈ రోజు (బుధవారం) కీలక నిర్ణయాలు తీసుకున్నారు. సీఎం జగన్ అధ్యక్షతన జరిగిన ఈ భేటీలో 63 అంశాలకు కేబినెట్ ఆమోదం తెలిపింది. ఇందులో 12వ పీఆర్సీ నియామకానికి, ప్రభుత్వ ఉద్యోగులకు జీపీఎస్ అమలుపై, కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్ధీకరణకు కేబినెట్ ఆమోద ముద్ర వేసింది. ప్రభుత్వ పెన్షన్ విధానంపై బిల్లును రూపొందించేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. ఏపీ గ్యారెంటీడ్ పెన్షన్ బిల్లు 2023 పేరుతో కొత్త పెన్షన్ విధానం అమలుకు కేబినెట్లో నిర్ణయించారు.
అమ్మఒడి పథకం అమలు, విద్యా కానుక పంపిణీ, జగనన్న ఆణిముత్యాలు పథకం అమలు, రాష్ట్రంలో కొత్త మెడికల్ కాలేజీల్లో 706 పోస్టుల భర్తీ, చిత్తూరు డెయిరీ ప్లాంట్ కు 28 ఎకరాల భూమిని లీజు ప్రతిపాదనకు, ఏపీ పౌరసరఫరాల కార్పోరేషన్ ద్వారా రూ.5 వేల కోట్ల రుణ సేకరణ, గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ లో ఎంవోయూలు కుదుర్చుకున్న సంస్థలకు భూ కేటాయింపుకు... ఇలా పలు అంశాలకు కేబినెట్ ఆమోదం తెలిపింది.