Magunta Raghava: ఢిల్లీ లిక్కర్ స్కాం.. మాగుంట రాఘవ బెయిల్ రద్దు చేయాలంటూ సుప్రీంకోర్టులో ఈడీ పిటిషన్

ED files petetion in Supreme Court to cancel Magunta Raghava bail

  • రాఘవకు మధ్యంతర బెయిల్ ఇచ్చిన ఢిల్లీ హైకోర్టు
  • రాఘవ చూపిన కారణాలు సరైనవి కావన్న ఈడీ
  • రేపు విచారించేందుకు అంగీకరించిన సుప్రీంకోర్టు వెకేషన్ బెంచ్

ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో నిందితుడిగా ఉన్న వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి కుమారుడు మాగుంట రాఘవరెడ్డికి ఢిల్లీ హైకోర్టు నిన్న రెండు వారాల మధ్యంతర బెయిల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. తన అమ్మమ్మ అనారోగ్యంతో ఉన్నందున బెయిల్ ఇవ్వాలంటూ ఆయన చేసుకున్న విన్నపం పట్ల హైకోర్టు సానుకూలంగా స్పందించింది. ఆయనకు బెయిల్ మంజూరు చేసింది. ఈ నేపథ్యంలో రాఘవకు ఢిల్లీ హైకోర్టు బెయిల్ ను సుప్రీంకోర్టులో ఈడీ సవాల్ చేసింది. మధ్యంతర బెయిల్ కు రాఘవ చూపిన కారణాలు సరైనవి కావని పిటిషన్ లో తెలిపింది. రాఘవ బెయిల్ అంశంపై రేపు విచారణ జరిపేందుకు సుప్రీంకోర్టు వెకేషన్ బెంచ్ అంగీకరించింది.

  • Loading...

More Telugu News